ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ ని డ్రగ్స్ మహమ్మారి ఎలా పట్టిపీడిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే పలువురు స్టార్ ప్రముఖులకు సైతం డ్రగ్స్ తీసుకొని అలవాటు ఉంది అని ఆఫీసర్లు వాళ్లకి నోటీసులు పంపించారు. ఆ లిస్ట్ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ హీరోయిన్ ఛార్మి కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా టాలీవుడ్ హీరోగా పేరు సంపాదించుకున్న నవదీప్ ను సైతం అధికారులు విచారిస్తున్నారు . ఇలా రోజుకు ఓ కొత్త మలుపు తిరుగుతున్న డ్రగ్స్ కేసులో ఇప్పుడు మరో విషయం హాట్ టాపిక్ గా మారింది.
డ్రగ్స్ ఇష్యూలో మరో షాపింగ్ ట్విస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. కాగా ఇప్పటికే చాలామంది ఈ డ్రగ్స్ ఇష్యూలో ఇరుక్కొని బాధపడుతున్న విషయం తెలిసిందే . హీరో నవదీప్ ఇప్పటికే దీనికి సంబంధించిన విచారణను ఎదుర్కొన్నారు . ఇలాంటి టైంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ అనుష్కకి సైతం డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది కేవలం పుకారే అంటూ కొట్టి పడేస్తున్నారు ఫ్యాన్స్ .
అసలు అనుష్క పై డ్రగ్స్ నిందలు ఎలా వచ్చాయి అంటే ..సైజ్ జీరో కన్నా ముందు సినిమాలు అనుష్క చాలా స్లిమ్ గా ఉండింది . అయితే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల కోసం రిస్కులు చేసే అనుష్క సైజ్ జీరో కోసం నాచురల్ గానే లావు పెరిగింది . ఈ విషయం అందరికీ తెలిసిందే . అయితే ఆ టైం నుంచి ఆమెకు డ్రగ్స్ తీసుకొనె అలవాటు ఉందని ..డ్రగ్ తీసుకున్న కారణంగానే ఆమె వెయిట్ పెరిగిందని.. ఇప్పుడు వెయిట్ తగ్గలేక పోతుంది అని.. సోషల్ మీడియాలో కొందరు గాసిప్ రాయళ్ళు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది కేవలం ఒట్టి పుకారే అని ఫ్యాన్స్ క్లారిటీ ఇస్తున్నారు . ఆమె ఏదో బరువు పెరిగినంత కారణంగా ఆమె డ్రగ్స్ తీసుకుంటుంది అని ఎలా చెప్పగలం..? స్వీటీ అలాంటిది కాదు.. అంటూ తేల్చి చెప్పేస్తున్నారు . ఎవరో పని పాట లేని గాసిప్ రాయళ్ళే ఇలా మంచి పేరున్న హీరోయిన్ ని ఈ ఇష్యూలోకి లాగి ఆమెను ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తున్నారు అని ..స్వీటీ చాలా చాలా మంచిదని ..ఆమెకు అసలు ఎలాంటి పాడు అలవాట్లు లేవు అని చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!