ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో బుల్లితెరలో ఉన్న అందాల ముద్దుగుమ్మలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న ఫార్ములాలు ఎక్కువగా ఫాలో అవుతున్నారు . అందుకే కాబోలు క్రేజ్ ఉండగానే రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేసి ఆ స్థాయిలో పుచ్చుకుంటూ ఆస్తులను వెనకేసుకుంటున్నారు. అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ యాంకర్ సౌమ్యరావు .
అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో ట్రాక్ లోకి వచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది. కేవలం యాంకర్ గానే కాదు ఈవెంట్స్ లో కూడా ఆమె మెరుస్తుంది . ఈ క్రమంలోనే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడంతో టైం చూసుకొని రెమ్యూనరేషన్ పెంచేసింది. ఎపిసోడ్ కి 40 – 50 -60 వేలు తీసుకుంటూ వచ్చిన సౌమ్య ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలు డిమాండ్ చేస్తుందట .
ఏదైనా ఈవెంట్ కి వెళ్లి కొద్దిసేపు మెరిసిన లక్ష రూపాయలు చెక్ చేతిలో పెట్టాల్సిందే అంటూ డిమాండ్ చేస్తుందట . నిన్న మొన్నటి వరకు 50 వేలకే చెక్ రాయించుకున్న సౌమ్యరావు రాత్రికి రాత్రి లక్ష రూపాయలు పెంచడానికి కారణం త్వరలో రాబోతున్న ఈవెంట్స్ అంటూ తెలుస్తుంది . వినాయక చవితి అయిపోయింది ఈ క్రమంలోనే ఇక ఈవెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు . అలాంటి ఈవెంట్స్ లో మెరిస్తే ఆమె కూడా నాలుగు రూపాయలు వెనకేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆమె ఎక్కువగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట . మేకర్స్ కూడా అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. టాప్ యాంకర్లు గా మెరిచిన అనసూయ-రష్మి కూడా ఈ రేంజ్ లో డిమాండ్ చేయలేదు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!