ఒకప్పుడు 12 – 13 – 14 ఏజ్ రాగానే ఇంట్లోని వాళ్ళు ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసేసేవారు . అయితే ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారిపోయింది. 30 – 35 కొంతమంది 40 వచ్చేవరకు కూడా పెళ్లిళ్లు చేసుకోవడం లేదు . రీజన్ ఏంటో తెలియదు కానీ అదే ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది . అయితే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది అంటున్నారు జనాలు .
కాగా ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ లా ఇండస్ట్రీలో సెటిలైపోదామని వచ్చి యాంకర్ గా సెటిల్ అయినా రష్మీ పేరు మారుమ్రోగిపోతుంది . మనకు తెలిసిందే జబర్దస్త్ ద్వారా స్టార్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ ప్రజెంట్ పలు ఈవెంట్స్ లో నటిస్తూ అడపా దడపా సినిమాల్లో కూడా మెప్పిస్తుంది . అయితే రష్మీ ఇంత వయసు వచ్చిన సరే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది .
కొందరు సుధీర్ కోసం అంటుంటే .. మరికొందరు తన అమ్మని తన నాన్న చీట్ చేశాడని ఆకారణంగానే అబ్బాయిలు అంటే ద్వేషిస్తుందని.. ఆమె పెళ్లి చేసుకోదు అని చెప్పుకొస్తున్నారు.. అయితే చాలామంది మాత్రం రష్మీకి పెళ్లయితే ఆఫర్లు రావని .. ఆ విషయం ఆమెకి తెలుసని అందుకే ఆమె పెళ్లి చేసుకోవట్లేదు అని వన్స్ ఆఫర్లన్నీ తగ్గుముఖం పడుతున్నాయి అని తెలిస్తే ఆమె పెళ్లి చేసుకుంటుందని ..అయినా పెళ్లి లేకుండా ఎవరు ఉంటారు అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు. దీంతో రష్మీ పెళ్లి వార్త నెట్టింట వైరల్ గా మారింది..!!