ఖుషి ఫస్ట్ వీకెండ్ ముగిసింది. సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అయినా సినిమా కొన్న వారందరూ సంతోషంగా ఉన్నారంటే చెప్పలేని పరిస్థితి కొన్ని ఏరియాలో బాగున్నాయి కొన్ని ఏరియాలో ఉన్నాయి చాలాకాలం తర్వాత విజయ్ దేవరకొండకు సరైన హిట్టు వచ్చింది. ఇటుసమంతకు కూడా హిట్టు పడింది. విడుదలైన మరుసటి రోజే క్రికెట్ మ్యాచ్ దెబ్బతీసింది.
ఆదివారం బాగుంది అనుకుంటే వెంటనే మండే వచ్చేసింది. పైగా అటు ఉత్తరాంధ్రకు.. ఇటు నైజాంకు తుఫాను వచ్చి పడింది. సినిమాకు మీడియాలో మంచి టాక్.. రివ్యూలు ఉన్న గ్రౌండ్ లెవెల్ లో డివైడ్ టాక్ ఉంది. లవ్ జానార్ సినిమా కావడంతో మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ కావటం లేదని చెబుతున్నారు. ఇక సీడెడ్ జనాలకు ఖుషి లాంటి సినిమాలు అంతగా ఎక్కవు. అందువల్ల అక్కడ బయ్యర్ కు ఖుషి బ్రేక్ ఈవెన్ కావటం కష్టమే అంటున్నారు.
సీడెడ్ లో ఖర్చులతో కలిపి 6 కోట్లు రాబట్టాలి.. ఇది చాలా కష్టం అని టాక్. నైజాంలో 15 కోట్ల రేషియో కనుక ఇప్పటికే 11 కోట్లు వసూలు చేసింది మెల్లగా టార్గెట్ రీచ్ అయినా భారీ లాభాలు రావని అంటున్నారు. వైజాగ్ – ఈస్ట్ – వెస్ట్ – కృష్ణ – గుంటూరు – నెల్లూరు ఏరియాలో ఎలా ? ఉంటాయో చూడాలి. కృష్ణా, గుంటూరు అయితే ఫస్ట్ వీకెండ్ నీరసమైన ఫిగర్లు కనిపించాయి. ఇక నాలుగు రోజులు తిరగకుండానే శెట్టి పోలిశెట్టి – జవాన్ సినిమాలు వస్తున్నాయి.
జవాన్ సినిమా ప్రభావం నైజాంలో చాలా ఎక్కువగా ఉంటుంది. శెట్టిపొలిశెట్టిలో అనుష్క హీరోయిన్. చాలా ఏళ్ల తర్వాత ఆమె థియేటర్లలో కనిపిస్తోంది. సినిమాకు టాక్ బాగుంటే ఈ రెండు సినిమాల ఎఫెక్ట్ కచ్చితంగా ఖుషి పై ఉంటుంది. ఈ పోటీ తట్టుకుని ఖుషి నిలబడాల్సి ఉంటుంది. అయితే ఖుషి సినిమా నిర్మాతలు మాత్రం ఖుషి ఖుషీగా ఉన్నారు.. వారికి మంచి లాభాలే వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా కొన్నవారికి ఏ స్థాయిలో లాభాలు వస్తాయో చూడాల్సి ఉంది.