Movies'ఖుషి' 3 డేస్ క‌లెక్ష‌న్స్‌.. బాక్స్ ఆఫిస్ దుమ్ము దులిపేసిన విజయ్...

‘ఖుషి’ 3 డేస్ క‌లెక్ష‌న్స్‌.. బాక్స్ ఆఫిస్ దుమ్ము దులిపేసిన విజయ్ దేవరకొండ.. మొత్తం ఎన్ని కోట్లంటే..!

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – సమంత కలయికలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెర‌కెక్కిన సినిమా ఖుషి. బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రు. 30 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్లగొట్టిన ఖుషి ఓవర్సీస్ లో ఇప్పటికే వన్ మిలియన్ డాలర్ల మార్క్ వసూళ్లు క్రాస్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారంతా మూడో రోజుల ముగించేసరికి ఈ పాన్ ఇండియా మెలోడీ డ్రామా రు. 70 కోట్ల వసూళ్లు అధిగమించింది. గుడ్ కాన్సెప్ట్ తో పాటు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఎమోషనల్ సాగే ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.

రు. 53 కోట్ల షేర్ వ‌స్తే సినిమా క్లీన్ హిట్‌. అయితే నాలుగైదు రోజుల‌కే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉంది. డీసెంట్గా అర్పించే లవ్ డ్రామా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ న‌టించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news