Moviesకిరణ్ అబ్బవరం డ్రీమ్ హౌస్ ఫోటోస్ చూశారా.. ఎంత బాగున్నాయో.. ఎన్ని...

కిరణ్ అబ్బవరం డ్రీమ్ హౌస్ ఫోటోస్ చూశారా.. ఎంత బాగున్నాయో.. ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందంటే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. తన సొంత ఇంటి కలను నిజం చేసుకున్నాడు దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా ఇప్పుడున్న టాలీవుడ్ ఫ్యాన్స్ కు ఈ పేరు పరిచయం అక్కర్లేదు . కిరణ్ అబ్బవరం నటించిన సినిమాల బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. రాజావారు రాణి గారు చిత్రంలో ఇండస్ట్రీతో ఎంట్రీకి ఇచ్చిన ఈ యంగ్ హీరో ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం అనే సినిమాతో మంచి ఫేమ్ దక్కించుకున్నాడు.

ఆ తర్వాత పలు సినిమాల ద్వారా పాపులారిటీ దక్కించుకున్న ఈయన రీసెంట్గా తన సొంత ఇంటి కల ను నెరవేర్చుకున్నారు . ప్రతి ఒక్కరి జీవితంలో ఈ కోరిక ఉండనే ఉంటుంది ..తనకంటూ సొంత ఇల్లు ఉండాలని ఎవరైనా అనుకుంటారు .. అదే కలను నెరవేర్చుకున్నారు . తన సొంత ఊరిలోనే ఈ ఇంటిని నిర్మించినట్లు తెలుస్తుంది . కడప జిల్లా రాయచోటికి చెందిన కిరణ్ గృహప్రవేశానికి సంబంధించిన వీడియో తన ఇన్ స్టా లో షేర్ చేశాడు .

ఇది చూసిన అభిమానులు ఆయనకు స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు . అంతేకాదు ట్రెండ్ కి తగ్గట్టే సాంప్రదాయాలని వాస్తులను ఫాలో అవుతూ చాలా స్పెషల్ గా ఎంతో ఇష్టంగా ఈ ఇల్లు నిర్మించుకున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఇల్లు కోసం కోట్లు ఖర్చు చేశాడు కిరణ్ అబ్బవరం అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరం కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news