Moviesయూఎస్‌లో ' ఖుషి ' ర్యాంపేజ్‌… ఫ‌స్ట్ డేకే షాకింగ్ క‌లెక్ష‌న్లు…!

యూఎస్‌లో ‘ ఖుషి ‘ ర్యాంపేజ్‌… ఫ‌స్ట్ డేకే షాకింగ్ క‌లెక్ష‌న్లు…!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా.. స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్గా తెరకెక్కిన సినిమా ఖుషి. టాలీవుడ్ లో తన సినిమాలకి ఓ స్పెషల్ మార్క్ సెట్ చేసుకున్న శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ లేటెస్ట్ లవ్ డ్రామా భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మొత్తం ఐదు భాషలలో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమాకు యూఎస్ లో సాలిడ్ వ‌సూళ్లు నమోదు అవుతున్నాయి.

జస్ట్ ప్రీమియర్ షో లతోనే నాలుగు లక్షల డాలర్లను టచ్ చేసిన ఈ సినిమా డే వన్ ముగిసేసరికి చాలా సులువుగా హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేస్తుంది అని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఓవరాల్ గా ఖుషి యూఎస్ లో తొలిరోజు ప్రీమియర్ ల నుంచి ర్యాంపేజ్ మొదలు పెట్టేసింది. ఇది అక్కడ ఖుషి కి సాలిడ్ వెల్కమ్ అని చెప్పాలి.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు హేషం అబ్దుల్ సంగీతం అందించారు. సినిమాకు తొలి అట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ కెరీర్ లోనే మరో సూపర్ హిట్ సినిమాగా రికార్డుల్లో నిలిచిపోతుందని టాలీవుడ్ అంచనా వేస్తోంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల రూపాయల ప్రి రిలీజ్‌ బిజినెస్ జరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news