Newsతెలుగులో గ్రాండ్ డెబ్యూ ఇవ్వబోతున్న జాన్వీ చెల్లి ఖుషి .. ఏ...

తెలుగులో గ్రాండ్ డెబ్యూ ఇవ్వబోతున్న జాన్వీ చెల్లి ఖుషి .. ఏ హీరోనో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పాపులారిటి సంపాదించుకున్న శ్రీదేవికి ఎలాంటి క్రేజీ స్థానాన్ని ఇచ్చారో మన తెలుగు జనాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నా సరే అందరూ శ్రీదేవి గారినే లైక్ చేసేవారు .. ఆమె అందం .. నటన .. టాలెంట్ అలాంటిది మరి . కాగా ఆమె వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చిన జాన్వికపూర్ సైతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీ గారు రెడీ అయింది .

దేవర సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది . అయితే ఇదే టైంలో జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ కూడా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఇప్పటికే బాలీవుడ్ బడా ఆఫర్ చేతుల్లో పెట్టుకోని ఉన్న ఖుషి కపూర్ .. రీసెంట్గా కొరటాల శివ.. ఆమెని తెలుగులో కూడా ఇంట్రడ్యూస్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అంతేకాదు అక్క చెల్లెలు ఒకే సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేయాలి అని కొరటాల చాలా చాలా కసిగా ప్లాన్ చేస్తున్నారట .

ఇదే విషయం బోనీకపూర్ కి కూడా చెప్పగా ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది . దేవర సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయింది . అయితే దేవర సినిమాలో గెస్ట్ రోల్ లో ఖుషి కపూర్ను నటించేలా చేయాలని .. తద్వారా ఇద్దరు అక్కచెల్లెళ్ల ఎంట్రీ ఆయన డైరెక్షన్లోనే వచ్చినట్లు ఉంటుంది అని ఇద్దరికీ క్రేజీ హిట్లు ఇచ్చినట్లు ఉంటుందని భావిస్తున్నారట . దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అక్కాచెల్లెళ్లకు క్రేజీ హిట్ ఇవ్వబోతున్నాడు మన తారక్ అంటూట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news