దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీకపూర్ ధడక్ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమెకు సరైన హిట్ ఒక్కటి లేదు. అయితే కెరీర్ ప్రారంభంలోనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నటించే ఛాన్స్ ఈమెకు వచ్చింది. హిట్ అన్నది పక్కన పెడితే జాన్వి గ్లామర్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను వేడెక్కిస్తూ ఉంటుంది
ఆమె తెలుగులో తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్‌కు జోడిగా దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జాన్వీకపూర్ గతంలో బాయ్ ఫ్రెండ్ తో షికారు చేస్తూ చాలాసార్లు కెమెరాలకు చిక్కింది. అయితే ఈమెకు ఇదివరకే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు.. కాకపోతే అతడితో బ్రేకప్ అయ్యింది. దీని గురించి జాన్వి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బయట పెట్టింది.
తన తొలిప్రేమ కొన్ని రోజుల్లోనే ముగిసిపోయిందని చెబుతూ బాధపడింది. పరిణితి లేని వయసు కారణంగా ఇద్దరం ఒక రకమైన అయోమయంలో ఉన్నాం.. దీంతో మా మధ్య ప్రేమలో నిజాయితీ లోపించింది.. అబద్దాలతోనే మా ప్రేమ – రిలేషన్ కొనసాగుతూ వచ్చింది.. ఆ సమయంలో తల్లిదండ్రులు చదువుపై దృష్టి పెట్టాలని గట్టిగా హెచ్చరించారట.
వారి మాటలు వింటే భవిష్యత్తు బాగుంటుందని అర్థమైంది.. దీంతో నా తొలిప్రేమకు ముగింపు పలికాను అని జాన్వి కపూర్ చెప్పుకొచ్చింది. ఇక దేవర సినిమాపై జాన్వీకపూర్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిపోవాలన్న ఆశలతో ఉంది.