Moviesహైద‌రాబాద్‌లో హోరెత్తిపోతోన్న ' జ‌వాన్ ' బుకింగ్స్‌… బాహుబ‌లి రికార్డులు మ‌టాష్‌…?

హైద‌రాబాద్‌లో హోరెత్తిపోతోన్న ‘ జ‌వాన్ ‘ బుకింగ్స్‌… బాహుబ‌లి రికార్డులు మ‌టాష్‌…?

బాలీవుడ్ కింగ్ కాంగ్ షారుక్ నటించిన జవాన్ ఓపెనింగ్ రికార్డుల గురించి ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. పఠాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత షారుక్ నటించిన జవాన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే రెడ్ చిల్లీస్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో షారుక్ ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమాలో ఫైట్స్ తో పాటు ప్రతి సీన్ యూనిక్‌గా ఉండేందుకు భారీతనం చూపించేందుకు అసాధారణ పెట్టుబడులు పెట్టారు. అది ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్లో కనిపించింది. ఇప్పటికే మన దేశంతో పాటు దేశ.. విదేశాల్లో అద్భుతమైన బుకింగ్‌లు జరుగుతున్నాయి. మన దేశంలో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్లు అయిన‌ పి.వి.ఆర్ – ఐనాక్స్ – సినీ పోలీస్ లలో ఇప్పటికే అత్యధికంగా టికెట్లు విక్రయించారు. 2017 లో బాహుబలి 2 సినిమా కోసం విక్రయించిన 6.5 లక్షల టికెట్ల రికార్డును సైతం జవాన్ అధిగమిస్తుందని తెలుస్తోంది.

పఠాన్ 5.6 టిక్కెట్లను అమ్మగా ఇప్పుడు ఆ రికార్డు కూడా జవాన్ బ్రేక్ చేయనుందని సమాచారం. ఇక హైదరాబాదులో జవాన్ అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయని ట్రేడ్ చెపుతుంది. కేవలం ఈ మెట్రో నగరంలోనే జవాన్ కోసం 300 కి పైగా షోలు కేటాయించగా 200 షోల టికెట్లు ఇప్పటికే శరవేగంగా అమ్ముడయ్యాయి. డిమాండ్‌కు తగినట్టుగా మరిన్ని షోలను పెంచుతున్నట్టు సమాచారం.

పివిఆర్ – ఐనాక్స్ అధికార బృందాలు చెబుతున్న దాని ప్రకారం జవాన్ ఓపెనింగ్ లలో భారీ రికార్డు కొల్లగొట్టబోతుందని.. దేశవ్యాప్తంగా ఇది బాహుబలి సినిమా రికార్డులను కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. షారుక్ – నయనతార జంటగా నటించిన ఈ సినిమాకు కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news