సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినీ స్టార్స్ ధరించే దుస్తులు వేసుకునే యాక్ససరీస్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతున్నాయి . అంతకుముందు పరిస్థితి వేరు ..వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్న ఎలాంటి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడిన అభిమానులకు తెలిసేది కాదు. ఆ వస్తువు లేదా ఆ డ్రెస్ ఎంత ఉంటుందా..? ఏ ప్రోడక్ట్ అని తెలుసుకోవడానికి నానాదంటాలు పడేవారు . కానీ సోషల్ మీడియా పుణ్యమంటూ అభిమానులకు స్టార్ హీరోలు హీరోయిన్లకు బాగా దగ్గరైపోయారు.
రీసెంట్గా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ వాచ్ నెట్టింట వైరల్ గా మారింది . మనకు తెలిసిందే.. రీసెంట్గా షారుక్ ఖాన్ నటించిన సినిమా జవాన్ . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఇలాంటి క్రమంలోనే సినిమా సక్సెస్ అయిన సందర్భంగా భారీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీం. ఈ ఈవెంట్లో షారుఖ్ ఖాన్ ధరించిన వాచ్ అందర్నీ అట్రాక్ట్ కి గురి చేసింది.
ఎవరు చూసినా సరే ఫస్ట్ ఆయన వాచ్ పైకే కళ్ళు వెళ్తున్నాయి. అంత స్టైలిష్ గా ట్రెండీగా ఆకర్షణీయంగా ఉంది. అయితే ఈ వాచ్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.. ముఖ్యంగా షారుఖ్ ధరించిన పటేక్ ఫిలిప్ వాచ్ స్పెషల్ గా నిలిచింది. క ఆ వాచ్ ధర తెలిసి అవాక్కవుతున్నారు నెటిజన్స్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ వాచ్ ఖరీదు 1.24 కోట్లు అంటూ తెలుస్తుంది . ఈ వాచ్ ఒక్కటి అమ్మితే ఓ మధ్యతరగతి కుటుంబం లైఫ్ లాంగ్ బతికేయొచ్చు అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . మొత్తానికి డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేసినా బాగానే ఉంటుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.