Moviesబోయపాటితో సూర్య సినిమా వెనక ఇంత మైండ్ బ్లోయింగ్ ప్లాన్ ఉందా..?...

బోయపాటితో సూర్య సినిమా వెనక ఇంత మైండ్ బ్లోయింగ్ ప్లాన్ ఉందా..? అబ్బే అన్ని తెలివితేటలు మన హీరోలకి లేవ్..!!

ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఉండే తెలుగు హీరోలు మన డైరెక్టర్ల కన్నా పక్క భాష డైరెక్టర్ లని ఎక్కువగా నమ్ముతూ వస్తున్నారు . మరీ ముఖ్యంగా మన ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ రేంజ్ లో దూసుకుపోయిన డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడం లేదు . ఆ లిస్టులోకే వస్తాడు బోయపాటి శ్రీను . అసలు బోయపాటి శ్రీనుకి ఇండస్ట్రీలో ఉండే స్టార్ ..పాన్ ఇండియా హీరోస్ అవకాశం ఇవ్వడం లేదు. రీసెంట్గా ఆయన రాం పోతినేనితో కలిసి స్కంద అనే సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా తర్వాత చాలామంది హీరోలతో సినిమా చేయడానికి ట్రై చేస్తున్న బోయపాటికి ఏ తెలుగు హీరో Call Sheets ఇవ్వడం లేదు . ఒక్క బాలయ్య తప్పిస్తే బోయపాటి ముఖం చూసే హీరోలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. ఇదే క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఆయనను ఆయన ట్రాక్ రికార్డును నమ్మి ఛాన్స్ ఇవ్వడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

త్వరలోనే బోయపాటి శ్రీను కాంబినేషన్లో సూర్య ఓ సినిమాలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే అదే కథను మన తెలుగు హీరోలకి ఎంతమందికి చెప్పిన బుర్రకి ఎక్కలేదని సూర్య మాత్రం టక్కున సినిమాను యాక్సెప్ట్ చేశారని ఫాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తుంటే.. కొంతమంది మాత్రం అయితే సూర్య ఖాతాలో బిగ్ డిజాస్టర్ తప్పదు అంటూ ఆయనే ట్రోల్ చేస్తున్నారు . అయితే సూర్య కేవలం హిట్ డైరెక్టర్లతోనే కాదు ఫ్లాప్ డైరెక్టర్లతోనూ సినిమా చేసి హిట్ కొట్టాలన్న కాన్సెప్ట్ తోనే ఆయనకు ఈ అవకాశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news