టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ – సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి ప్రేమ వివాహం ఒక సంచలనం. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా పుట్టాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో నాగర్జున హీరోగా వచ్చిన చంద్రలేఖ సినిమా షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ చివరకు పెళ్లికి దారితీసింది. చాలా ఏళ్లపాటు కలిసి కాపురం చేశాక ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి.
అసలు వీరిద్దరి మధ్య ఏ కారణంతో మనస్పర్ధలు తలెత్తాయి.. ఏం జరిగిందని దానిపై చాలామందికి ఇప్పటికీ క్లారిటీ లేదు. పెళ్లయ్యాక ఏడాది పాటు రమ్యకృష్ణ సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఆ టైంలో కృష్ణవంశీ డైరెక్టర్ గా చేసిన అన్ని సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో రమ్యకృష్ణ సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
పైగా కృష్ణవంశీతో పోలిస్తే రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ. ఆమె రోజు కాల్ షీట్ రేటు 10 లక్షలు ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. కృష్ణవంశీ వరుస ప్లాపులతో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పూర్తిగా రమ్యకృష్ణ సంపాదన మీద ఆధార పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. సహజంగానే ఇక్కడ ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు తలెత్తేయని.. దానివల్లే వారి ఇద్దరు కొన్నాళ్లపాటు దూరం దూరంగా ఉన్నారన్న ప్రచారం జరిగింది.
కృష్ణవంశీ హైదరాబాదులో ఉంటే రమ్యకృష్ణ చెన్నైలో ఉంటూ వచ్చారు. ఆ తర్వాత కొందరు పెద్దలు సలహాలు పాటించి వారు కలిసి ఉంటున్నట్టు సమాచారం. అయినా కూడా వారి మధ్య కొంత గ్యాప్ ఉందని ఇండస్ట్రీ టాక్.