Moviesవామ్మో.. ANR కి అలాంటి పిచ్చి కూడా ఉందా..? భార్య కూడా...

వామ్మో.. ANR కి అలాంటి పిచ్చి కూడా ఉందా..? భార్య కూడా సపోర్ట్ చేసిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ఉన్నా..ఆయన అంటే ఎక్కువ గా లైక్ చేసే వారు. రీసెంట్గా ఆయన శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహావిష్కరణ ఉత్సవం చాలా ఘనంగా జరిగింది.

ఈ వేడుకకి సినిమా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై అక్కినేని ఫ్యామిలీ పట్ల అక్కినేని నాగేశ్వరరావు గారి పట్ల ఉన్న గౌరవాన్ని ప్రూవ్ చేసుకున్నారు . ఇలాంటి క్రమంలోనే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఉన్న ఓ అలావాటు గురించి బయటపడ్డింది. ఆయనకి బొమ్మలంటే మహా మహా ఇష్టమట. మరి ముఖ్యంగా కొయ్యలతో చేసిన బొమ్మలు అంటే చాలా ఇష్టంగా లైక్ చేస్తారట. షూటింగ్ పనిమీద ఎక్కడికి వెళ్ళినా సరే కొయ్య బొమ్మలు కనిపిస్తే ఖచ్చితంగా కొనేస్తారట . తన దగ్గర డబ్బు లేని సమయంలో కూడా కొయ్య బొమ్మలకే ఉన్న డబ్బులు పోసి కొన్న సందర్భాలు కూడా ఉన్నాయట .

అంతేకాదు అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య అన్నపూర్ణమ్మకు కూడా కొయ్య బొమ్మలు అంటే బాగా ఇష్టమని .. ఇద్దరు చాలా చాలా కొయ్యబొమ్మలని జత చేర్చుకున్నారని ఇప్పటికీ ఆ బొమ్మలు అక్కినేని నాగార్జున ఇంట్లో చాలా చాలా పదిలంగా ఉన్నాయని తెలుస్తుంది. స్టార్ స్టేటస్ వచ్చాక చాలామంది తమకి డబ్బు వచ్చిందని విర్రవీగుతూ ఉంటారు కానీ అక్కినేని నాగేశ్వరరావు గారికి మాత్రం ఆహంకారం ఎప్పుడూ లేదు అందరిని ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ ఉంటారు అందుకే మహానుభావుడు అన్నేళ్లు బ్రతికి .. జనాలలో చెరగని స్థాయిని క్రియేట్ చేసుకున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. అలాంటి మహానుభావుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news