అత్యంత ఖరీదైన టీవీ రియాలిటీ షో బిగ్ బాస్. నచ్చే వాళ్ళు చూస్తారు.. నచ్చని వాళ్ళు తిడతారు. మొదట్లో వచ్చిన కొన్ని సీజన్లను జనం ఆసక్తిగానే చూశారు. తర్వాత తెలుగు బిగ్ బాస్ కు క్రమేపి ఆదరణ తగ్గిపోయింది. ఓటీటీ షో పెద్ద ప్లాప్. దాన్ని మించి గత సీజన్ అట్టర్ ప్లాప్ కాదు కాదు.. డిజాస్టర్. నాగార్జున ఆఫీసర్ సినిమాను మించిన డిజాస్టర్. నాగార్జునకు ఉన్న పరువు కూడా పోయింది.
నాగార్జునకు పరువు కంటే పైసలు ముఖ్యం అన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. అయితే ఈసారి అలా కాదు బిగ్ బాస్ 7 సీజన్ అదరగొడతాం.. మస్తు మార్పులు చేశాం కుమ్మేస్తాం అంటూ తెగ ప్రచారం చేశారు. నాగార్జున అయితే ఉల్టా పుల్టా అని తెరమీదకు వచ్చేసి ఏదేదో ప్రోమో చూపించాడు. కానీ శనివారం వీకెండ్ షో నిస్సారంగా, నీరసంగా నడిచింది.
ఉన్నదే 14 మంది అందులో ప్రియాంక జైన్ పర్లేదు. పవర్ అస్త్ర కోసం పోటీపడి ఓడిపోయింది. కానీ చాలా యాక్టివ్ గా ఉంది. శివాజీ నిజ జీవితంలో లాగా ఇక్కడ కూడా ఓవరాక్షన్.. నాగార్జునకు ఎందుకు నచ్చాడో తెలియడం లేదు. యాంకర్ దామిని జస్ట్ పర్లేదు. శనివారం ఆడియన్స్ రేటింగ్ లో కూడా షో అట్టర్ ప్లాప్. నటి శుభశ్రీ కూడా సోసో..! వెటర్న్ నటి షకీలా ఎక్కువ రోజులు హౌస్ లో ఉండదని స్పష్టంగా తెలిసిపోతుంది.
టీవీ నటి శోభా శెట్టి బాగున్నా ఇంకా యాక్టివ్ కావాలి. కొరియోగ్రాఫర్ సందీప్ యాక్టివ్ తొలి పవర్ అస్త్ర విజేత. టేస్టీ తేజ అపీరియన్స్ ఏమాత్రం బాగోలేదు. కాకపోతే సరదాగా ఉంటున్నాడు. మిగిలిన వారిలో బలమైన పోటీదారు రతిక రోజ్. డాక్టర్ గౌతమ్ – కిరణ్ రాథోడ్ అట్టర్ ప్లాప్ కంటెస్టెంట్లు. కిరణ్ ఇప్పటికే బయటికి వచ్చేసింది. ఏది ఏమైనా వీకెండ్ షో పెద్దగా రక్తి కట్టలేదు. ఈ సారి షో కూడా డిజాస్టర్ బాటలోనే నడుస్తోంది.