News' స‌లార్ ' రిలీజ్ కొత్త డేట్ వ‌చ్చేసింది... ఇండియ‌న్ బాక్సాఫీస్...

‘ స‌లార్ ‘ రిలీజ్ కొత్త డేట్ వ‌చ్చేసింది… ఇండియ‌న్ బాక్సాఫీస్ బ‌ద్ద‌లే..!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా దర్శకుడు ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన భారీ సినిమా సలార్. కే జి ఎఫ్ సీరిస్‌ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ భారీ బడ్జెట్
యాక్షన్ థ్రిల్లర్ కోసం ఇండియన్ సినీ జనాలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఏ స్థాయిలో పెరిగిందో చూశాం.

ఇటు కేజీఎఫ్ సీరియస్ సినిమాలతో ప్రశాంత్ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న సలార్ సినిమాపై మామూలు అంచనాలు లేవు. ఈ సినిమా కోసం అంతా ఎగ్జైటింగ్ ఎదురుచూస్తున్న వేళ ఈ సినిమా వాయిదా పడిందన్న వార్తలతో ఒక్కసారిగా ఇండియన్ సినీ అభిమానులలో తీవ్ర నిరుత్సాహం నెలకుంది. ఇప్పుడు సలార్ సరికొత్త రిలీజ్‌ డేట్ ఎప్పుడు అనేది అందరిలో ఆసక్తిగా మారింది.

లేటెస్ట్ బజ్‌ ప్రకారం సలార్ దీపావళికి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పాన్ ఇండియా రిలీజ్ కి ఇదే కరెక్ట్ సమయం అని మేకర్స్ భావిస్తున్నారట. అయితే నవంబర్ 3 లేదా నవంబర్ 10కి సినిమాని థియేటర్లలోకి దింపే ప్రయత్నాలు అయితే మొదలయ్యాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక స‌లార్ సినిమాకు ఏ మాత్రం హిట్ టాక్ వ‌చ్చినా కూడా ఇండియ‌న్ బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కావ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news