Newsనాని సినిమాలో నాకు అన్యాయం... ఎంత ఇబ్బంది పెట్టారంటే... హీరోయిన్ పూర్ణ...

నాని సినిమాలో నాకు అన్యాయం… ఎంత ఇబ్బంది పెట్టారంటే… హీరోయిన్ పూర్ణ సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌..!

నేచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ సినిమాలలో దసరా ఒక‌టి. నాని కెరీర్ లోనే తొలిసారిగా 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమాలో నాని నటనకు సర్వత్ర ప్రశంసలు వచ్చాయి. అయితే దసరా సినిమా గురించి సీనియర్ హీరోయిన్ పూర్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. దసరా సినిమా షూటింగ్ సమయంలో తనను చాలా ఇబ్బంది పెట్టారని పూర్ణ చెప్పుకొచ్చింది.

ఒకప్పుడు హీరోయిన్గా మెప్పించిన పూర్ణ ప్రస్తుతం పలు టీవీ షోలు చేస్తూ అల్లరిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు అఖండ – దసరా లాంటి సినిమాల్లో మెరిసిన విషయం తెలిసిందే. దసరా సినిమాలో విలన్ కు భార్య పాత్రలో చేసిన పూర్ణ ఆ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డానంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా పూర్ణా ప్రెగ్నెంట్ గా ఉన్నారు.

ప్పుడు కొన్ని సీన్లు వర్షంలో చేయాల్సి వచ్చింది. అది కూడా రాత్రి సమయంలో వర్షం పడుతున్నప్పుడు..! ఓవైపు గర్భంతో ఉండడంతో పాటు ఇటు చల్లటి నీళ్లలో, క‌టిక చ‌లిలో చేయాల్సి రావడంతో హెల్త్‌పరంగా మూడు నాలుగు రోజులు పూర్ణ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారట. పైగా త‌న సీన్లు ఎక్కువగా రాత్రి సమయంలోనే ఉన్నాయని.. చ‌లిలో, చన్నీళ్లలో ఆయా సీను చేయటం కష్టంగా అనిపించిందని చెప్పింది.

అయినా ఎంతో కష్టపడి చేస్తే తీరా ఎడిటింగ్ లో తన సీన్లు చాలా వరకు తీసేసారని పూర్ణ ఆవేదన వ్యక్తం చేసింది. తాను పడిన కష్టం అంతా వేస్ట్ అయిందని వాపోయింది. పూర్ణ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news