Moviesటాలీవుడ్‌లో ఆ రికార్డ్ స‌మంత‌కు మాత్ర‌మే.. చిరు, ప‌వ‌న్‌, బ‌న్నీ, ఎన్టీఆర్...

టాలీవుడ్‌లో ఆ రికార్డ్ స‌మంత‌కు మాత్ర‌మే.. చిరు, ప‌వ‌న్‌, బ‌న్నీ, ఎన్టీఆర్ కూడా లేదు…!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 1 రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్ లో రు. 15 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించి అక్కడ బ్రేక్ ఈవెన్ దాటేసింది.

ఖుషి సినిమా అక్కడ వన్ మిలియన్ దాటి రెండు మిలియన్ డాలర్ల వైపు దూసుకుపోతుంది. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమా హీరోయిన్ సమంత అరుదైన రికార్డు నమోదుచేసింది. ఖుషీతో ఆమె నటించిన 17 సినిమాలు అమెరికాలో వన్ మెరిన్ డాలర్ల మార్క్‌ను దాటాయి. ఇక విజయ్ కెరీర్‌లో అమెరికాలో వన్ మిలియన్ దాటిన నాలుగవ సినిమాగా ఖుషి ఉంది.

మన తెలుగు హీరోల విషయానికి వస్తే మహేష్ బాబు 11 సినిమాలు – నాని ఎనిమిది సినిమాలు – యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏడు సినిమాలు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏడు – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 5 – రెబల్ స్టార్ ప్రభాస్ 5 – మెగాస్టార్ చిరంజీవి 4 – రౌడీ హీరో విజయ్ దేవరకొండ నాలుగు సినిమాలతో వన్ మిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సమంతతో పోలిస్తే చాలా చాలా వెనుక ఉన్నారని చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news