Moviesతెలుగు డైరెక్ట‌ర్స్ అలాంటోళ్లే అంటూ ప‌చ్చిగా మాట్లాడినా ఇలియానా..!

తెలుగు డైరెక్ట‌ర్స్ అలాంటోళ్లే అంటూ ప‌చ్చిగా మాట్లాడినా ఇలియానా..!

సన్న నడుము సుందరి ఇలియానా ఒకానొక టైంలో తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆమె సన్నని నడుముకు ఫిదా అవ్వని కుర్ర‌కారు లేరు. రామ్ హీరోగా వచ్చిన దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె తొలి సినిమాతోనే అందరిని ఎంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. పోకిరి ఇండస్ట్రీ హిట్ కావడంతో ఇలియానాకు తెలుగులో వెనక్కి తిరిగి చూసుకొని అవకాశం కాకుండా పోయింది.

ఆ తర్వాత వరుసగా పవన్ కళ్యాణ్ – ప్రభాస్ – జూనియర్ ఎన్టీఆర్ – అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు పక్కన వరుసగా నటించే ఛాన్స్ కొట్టేసింది. తెలుగుతో పాటు తమిళంలోనూ అదే రేంజ్ లో క్రేజీ సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టిన ఇలియానా అక్కడ పెద్దగా సక్సెస్ లో రాక డీలా పడిపోయింది. తిరిగి ఆమె తెలుగులోకి తిరిగి వచ్చినా అప్పటికే కొత్త హీరోయిన్లు పోటీ ఎక్కువగా ఉండటంతో ఆమెను ఇక్కడ పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు.

అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలియానా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల గురించి మాట్లాడిన‌ కొన్ని మాటలు వైర‌ల్‌గా మారాయి. మీరు సౌత్ లో అందరు స్టార్ట్ హీరోలతో నటించాను.. ఎన్నో సూపర్ హిట్లు అందుకున్నాను… కానీ నటన పరంగా మిమ్మల్ని ప్రేక్షకులు గుర్తించుకునే పాత్ర ఇప్పటివరకు పడలేదని ఇండస్ట్రీలో చాలామంది అంటూ ఉంటారు.. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటని యాంకర్ ప్రశ్నించగా ఇలియానా షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

నేను ఎలాంటి పాత్రలో అయినా పోషిస్తాను.. తెలుగు డైరెక్టర్స్ ఎక్కువగా నాలో నటన కంటే నా నడుము ఎన్ని యాంగిల్స్ లో చూపించాలి అనేదానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వాళ్ళకి ఎప్పుడు నా స‌న్న‌ని న‌డుము మీదే దృష్టి ఉంటుంది అంటూ సంచలన కామెంట్ చేసింది. ఏది ఏమైనా ఇలియానాను తెలుగు ప్రేక్షకులు స్టార్ హీరోయిన్ చేస్తే ఆమె టాలీవుడ్ను కాస్త తక్కువ చేసేలా మాట్లాడిందన్న విమర్శలు ఆమెపై ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news