ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతున్నాయి.. ఒకప్పుడు స్టార్స్ గా మారిన హీరోస్ అందరు ఇప్పుడు డమ్మీలు అయిపోతున్నారు.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలయ్య – అక్కినేని నాగార్జున – విక్టరీ వెంకటేష్ ఒకప్పుడు ఈ నలుగురు వల్లే సినిమా ఇండస్ట్రీ నిలదొక్కుకోగలిగింది . అయితే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోతుంది . మారిపోతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజీకి కొత్త కొత్త డైరెక్టర్ లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం .. కొత్త హీరోలు స్టార్ హీరోలుగా మారడం జరిగిపోతుంది .
మరీ ముఖ్యంగా అక్కినేని నాగార్జున – విక్టరీ వెంకటేష్ కెరియర్ అయితే క్లోజ్ అయిపోయింది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .రీసెంట్గా ఆ లిస్టులోకి యాడ్ అయిపోయాడు మెగాస్టార్ చిరంజీవి . ఈ మధ్యకాలంలో ఆయన నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతుంది . దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ భోళాశంకర్. అయితే ఈ నలుగురితో కంపేర్ చేస్తే ముగ్గురు కెరియర్లు ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయినట్లే. ఇక మిగిలింది బాలకృష్ణ ఒక్కరే. నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తూ ఆయన నటించిన సినిమాలు 100 కోట్లు క్రాస్ అయ్యేలా చూసుకుంటున్నారు.
అయితే బాలయ్య సైతం ఇక హీరోగా సినిమా ఆపేసి సీనియర్ పాత్రలు పోషించాలని డిసైడ్ అయ్యారట . యంగ్ హీరోస్ కి ఛాన్స్ ఇవ్వడానికి ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . ప్రజెంట్ భగవంత్ కేసరిలో హీరోగా నటిస్తున్న బాలయ్య .. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో సైతం యంగ్ లుక్స్ లో కనిపించడానికి ఓకే చెప్పారట . కానీ ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం నుంచి బాలయ్య సీనియర్ పాత్రలో పోషించడానికి డిసైడ్ అయ్యారట . ఒకవేళ నిజంగానే నిజమైతే బాలయ్య యంగ్ లుక్స్ లో హీరోగా కనిపించే ఆఖరి సినిమా బాబి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా నే అని చెప్పాలి .ఒక విధంగా నందమూరి అభిమానులకు ఇది బాడ్ న్యూస్ అయినా మరోపరంగా కొత్త జనరేషన్ కి ఛాన్స్ ఇవ్వడానికి బాలయ్య తీసుకున్న నిర్ణయం మంచిదే అని అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి దీనిపై బాలయ్య ఏ విధంగా స్పందిస్తారో..?