ఐ బొమ్మ ఈ ప్రముఖ మూవీ వెబ్సైట్ గురించి ఇండియన్ సినిమా ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. ఇక తెలుగు సినీ ప్రేమికులు అయితే ఐ బొమ్మను పేదవాడి ఓటీటీ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. కొత్తగా వచ్చిన సినిమాలను కూడా నయా పైస ఖర్చు లేకుండా ఈ వెబ్సైట్లో చూస్తూ ఉంటారు. కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చిన వెంటనే క్వాలిటీ ప్రింట్ ను ఐ బొమ్మలో పెట్టేస్తూ ఉంటారు
దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో వందల రూపాయలు ఖర్చుపెట్టి థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడలేని వారంతా ఐ బొమ్మలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఐ బొమ్మ వెబ్‌సైట్‌కు తిరుగులేని క్రేజ్ ఉంది. తాజాగా ఐ బొమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ కి గట్టి వార్నింగ్ ఇస్తూ ఒక నోటు కూడా పెట్టింది. నిర్మాతలు హీరోలకు ఎక్కువ రెమ్యూనరేషన్లు ఇస్తూ ఎక్కువ రేట్లకు సినిమాలను అమ్ముతున్నారు.
అటు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎక్కువ రేట్లు పెట్టి మధ్యతరగతిని దోచుకుంటున్నారు అంటూ విమర్శించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాలను మా వెబ్సైట్లో ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు.. చిరంజీవి సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపక పోవడం మేం గమనించాం.. అందుకే మా ఐ బొమ్మ మూవీ టీం చిరంజీవి సినిమాలను మా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని అనుకోవడంలేదని మెసేజ్ పెట్టింది.
చిరంజీవి ఈ తరం జనరేషన్‌కు అస్సలు కనెక్ట్ కావడం లేదట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో పిచ్చపిచ్చగా వైరల్ అవుతుంది. దీంతో చిరంజీవి అభిమానులు ఐ బొమ్మపై తీవ్రంగా పైర్ అవుతున్నారు.