Moviesటంగ్ స్లిప్ అయిన "బేబీ".. అడ్డంగా ఆడేసుకుంటున్న కుర్రాళ్ళు..ఉన్న పరువు పాయే..!!

టంగ్ స్లిప్ అయిన “బేబీ”.. అడ్డంగా ఆడేసుకుంటున్న కుర్రాళ్ళు..ఉన్న పరువు పాయే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఏ రేంజ్ లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అంతకుముందు పలు వెబ్ సిరీస్లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో ..షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించి మెప్పించిన వైష్ణవి.. బేబీ సినిమా ద్వారా హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవ్వడంతో అభిమానులు షాక్ అయిపోయారు . అంతేకాదు ఈ సినిమాతో ఏకంగా సూపర్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది వైష్ణవి చైతన్య .

ఇప్పుడు ఆమె ఖాతాలో ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయి. అయితే దీనిపై ఒక్కటి కూడా అఫీషియల్ ప్రకటన బయటకు రాలేదు. కాగా ఇలాంటి క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీ ఇవే అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది. ” పెద్దగా ఆస్తిపాస్తులు అవసరం లేదు.. హ్యాండ్సమ్ గా లేకపోయినా నాకు పర్వాలేదు .. నాకు కోటీశ్వరుడు భర్తగా రావాలన్న ఆశ ఎప్పుడూ లేదు ..నన్ను బాగా చూసుకోవాలి ..ఉన్నదాంట్లో మేమిద్దరం సంతోషంగా ఉంటే నాకు అదే చాలు డబ్బు అందం లేకపోయినా.. నాపై ప్రేమ కేరింగ్ ఉంటే అదే నాకు కోట్ల ఆస్తి “అంటూ చెప్పుకొచ్చింది.

అయితే వైష్ణవి చైతన్య కామెంట్స్ పై కుర్రాళ్ళు ఫన్నీగా కౌంటర్ చేస్తున్నారు . నువ్వు అడిగిన క్వాలిటీస్ అన్ని మాలో ఉన్నాయి ..మమ్మల్ని పెళ్లి చేసుకో.. అంటూ ఆమెను ట్యాగ్ చేసి మరి కామెంట్ చేస్తున్నారు. దీంతో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news