Moviesహృతిక్ రోష‌న్ యేడాది ఫిట్‌నెస్ ఖ‌ర్చుతో ఓ తెలుగు సినిమా తీసేయొచ్చు..!

హృతిక్ రోష‌న్ యేడాది ఫిట్‌నెస్ ఖ‌ర్చుతో ఓ తెలుగు సినిమా తీసేయొచ్చు..!

ఆ హీరో వయసు 50 సంవ‌త్స‌రాలు.. కానీ అసలు అలా కనిపించడు.. సిక్స్ ప్యాక్ బాడీతో అమ్మాయిల‌ మనసు దోచేస్తూ ఉంటాడు. యాక్షన్ సీన్లు.. గ్రేస్ స్టెప్పులతో ఈ వయసులో కూడా థియేటర్లలో అభిమానులతో కేకలు పెట్టిస్తూ ఉంటాడు. ఒక్కో సినిమాకు కోట్లలోనే పారితోషం తీసుకుంటాడు. విచిత్రం ఏమిటంటే ఆ స్టార్ హీరో ఫిట్నెస్ కోసం కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఇంత‌కు ఆ స్టార్ హీరో ఎవరో ? కాదు బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్.

హృతిక్ రోషన్ పేరు చెప్పగానే చాలామందికి క్రిష్ సినిమాలు గుర్తొస్తాయి. తెలుగు ప్రేక్షకులకు కూడా తొలి సినిమా నుంచి హృతిక్‌ చాలా పాపులర్. ప్రస్తుతం హిందీలో యాక్షన్ తరహా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన కూడా మంచి బాడీ షేప్ ఉండేలా చూసుకుంటాడు. ప్రతి డైలీ వర్కౌట్స్ మాత్రం అస్సలు మర్చిపోడు. తన బాడీ ఫిట్.. పర్ఫెక్ట్ షేపులో ఉండేందుకు పర్సనల్గా ఒక ట్రైనర్ను కూడా నియమించుకున్నాడు.

ఆ ట్రైనర్ పేరు క్రిస్ గేతిన్. ఇతడు ఒక ఫారినర్. ఇత‌డికి ప్రతినెల 20 లక్షల ఫీజు చెల్లిస్తున్నాడట హృతిక్. ఏడాదికి లెక్కలేసుకుంటే రెండున్నర కోట్లు అతడు తన ట్రైనర్ కోసం ఫీజు ఇస్తున్నాడు. ఇది తెలిసిన ఫ్యాన్స్ అయితే అవాక్కవుతున్నారు. బహుశా ఫిట్నెస్ కోసం ఈ రేంజ్ లో ఖర్చుపెడుతున్న ఇండియ‌న్‌ స్టార్ హీరో హృతిక్‌ ఒక్కడే అయి ఉంటాడు. ఈ బ‌డ్జెట్‌తో తెలుగులో ఓ చిన్న సినిమా తీసేయొచ్చ‌ని కామెంట్లు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఫైటర్ మూవీ చేస్తున్న హృతిక్‌… దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న వారు 2 సినిమాలో నటిస్తాడు. ఈ డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫైనల్ చేశారు. 2025 జనవరి 25న ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news