శివాజీ చాలామందికి పరిచయం అవసరం లేని పేరు. తెలుగులో కమెడియన్ స్థాయి నుంచి సినిమాలలో చిన్నాచిత పాత్రలు వేసుకుని ఆ తర్వాత హీరోగా ఎదిగారు. తాజాగా బిగ్ బాస్ లోకి శివాజీ ఎంట్రీ ఇచ్చారు. శివాజీ నేపథ్యం విషయానికి వస్తే శివాజీది గుంటూరు జిల్లాలోని నరసరావుపేట. సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చిన శివాజీ ముందు జెమినీ టీవీలో వీడియో ఎడిటర్ గా పనిచేశారు.
ఆ తర్వాత ఓ సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. అక్కడ నుంచి సినిమాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు చేసే స్థాయికి ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో ఆయన స్టూడెంట్ పాత్రలో నటించారు. అతడు నటించిన తొలి సినిమా సీతారాముల కళ్యాణం చూతము రారండి.. కానీ ముందుగా రిలీజ్ అయింది మాత్రం మాస్టర్.
ఆ తర్వాత మిస్సమ్మ – అమ్మాయి బాగుంది – మిస్టర్ అండ్ మెసేజ్ శైలజ కృష్ణమూర్తి – అదిరిందయ్యా చంద్రం – టాటా బిర్లా మధ్యలో లైలా – సత్యభామ – మా ఆయన చంటి పిల్లాడు సినిమాలలో హీరోగా నటించారు. అలాగే జగపతిబాబు – హరికృష్ణ నటించిన శివరామరాజు సినిమాలో కూడా నటించారు.
2018 లో వచ్చిన గ్యాంగ్ స్టార్ అనే వెబ్ సిరీస్ లో కూడా కనిపించారు. బుల్లితెరపై హోస్టుగా వ్యవహరించే స్థాయి నుంచి సినిమా హీరోగా మారిన శివాజీ అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. శివాజీ భార్య ఎవరో కాదు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ వీ. గంగాధర్ గౌడ్ తొడళ్లుడు కుమార్తె కావడం విశేషం.