విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా కచ్చితంగా సమంత, విజయ్ కెరీర్ లో మంచి హిట్ సినిమాగా నిలుస్తుంది అన్న టాక్ అయితే వచ్చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో సమంత మాజీ భర్త టాలీవుడ్ కుర్ర హీరో నాగచైతన్య కొద్ది రోజులు పాటు బయటకు రారని.. మీడియా ముందుకు వచ్చేందుకు కూడా చైతు ఇష్టపడటం లేదన్న పుకార్లు అయితే బయట వినిపిస్తున్నాయి.
ఖుషి సినిమా హిట్ అవ్వటానికి చైతు అజ్ఞాతంలోకి వెళ్ళటానికి కారణం ఎంటన్న ? దాని పై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. ఖుషి సినిమాలో సమంత చాలా హాట్ రొమాన్స్ చేసింది. ట్రైలర్ చూస్తేనే విజయ్ దేవరకొండ – సమంత మధ్య రొమాన్స్ ఏ స్థాయిలో ? ఉందో అర్థం అవుతుంది. దీనికి తోడు ఖుషి లైవ్ ఈవెంట్లో వేదిక మీదే విజయ్ దేవరకొండ – సమంత ఇద్దరు ఎంత రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఇద్దరు ఘాటుగా ఒకరిని ఒకరు హత్తుకుపోయారు.
సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకోవడంతో నాగచైతన్య ఎక్కడికి వెళ్లినా పెళ్లి అయ్యి విడాకులు అయ్యాక మీ మాజీ భార్య ఇలా చేయటంపై మీ స్పందన ఏంటి ? అన్న ప్రశ్న తరచూ తలెత్తుతుందని దీనికి ఆన్సర్ చెప్పేందుకు కూడా చైతు ఇష్టపడడని అంటున్నారు. ఇలాంటి ప్రశ్నలు ఫేస్ చేయడం ఇష్టం లేకే నాగచైతన్య కొద్ది రోజులు పాటు అందరికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
వారం రోజుల పాటు తాను ఉంటే ఫ్లాట్ కాళీ చేసి సిటీకి దూరంగా వెళ్లి అక్కడే ఫామ్‌హౌస్‌లో ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. కేవలం సినిమా విషయాలు.. తన స్నేహితుల నుంచి వచ్చే కాల్స్ తప్ప ఇతర కాల్స్ కూడా స్పందించకూడదు అని చైతు గట్టి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అక్కినేని – చైతు అభిమానులు మాత్రం ఇవన్నీ లేనిపోని పుకార్లు.. విడాకులు అయ్యాక సమంత ఏం చేసుకున్న మా హీరోకు ఎందుకు సంబంధం ఉంటుందని కౌంటర్లు ఇస్తున్నారు.