సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఎక్కువ కాలం పాటు కొనసాగాలని మంచి సినిమాలు చేస్తూ స్టార్ డం ఎంజాయ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే అవకాశాలు ఎప్పుడు ఎలా ? వస్తాయి అనేది ఎవరూ చెప్పలేరు. ఒకరికి హిట్ సినిమాలు పడితే జీవితకాలం అలాగే హిట్ సినిమాలు పడతాయి అన్న గ్యారెంటీ లేదు. ఇండస్ట్రీలో ఎవరైనా ఎప్పుడైనా ఏ పోజిషన్లో అయినా ఉండొచ్చు.
ఒక సినిమా హిట్ అయితే ఎవరైనా టాప్ లెవెల్ కి వెళ్ళిపోతారు. అందుకే ఇక్కడ జాగ్రత్తగా సినిమాలు చేయాలని ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. హీరో వేణు తొట్టెంపూడి తెలుగు సినిమా ప్రేక్షకులకు బాగా పరిచయం. సీనియర్ దర్శకుడు బి.గోపాల్‌కు వేణు స్వయానా మేనల్లుడు కావడం విశేషం. లయ హీరోయిన్గా వేణు హీరోగా వచ్చిన స్వయంవరం సినిమా సూపర్ హిట్ అయింది. ఇది వేణుకు తొలి సినిమా.
ఆ తర్వాత పెళ్ళాం ఊరెళితే – ఖుషిఖుషీగా – చిరునవ్వుతో – హనుమాన్ జంక్షన్ లాంటి హిట్ సినిమాలలో నటించి నటుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ దమ్ము సినిమాలో నటించాక చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని గత ఏడాది రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. వేణు స్వయంవరం సినిమా తర్వాత చేసిన మనసుపడ్డాను కానీ లో రాశి హీరోయిన్గా నటించింది. ఆ సమయంలో వీరిద్దరూ చాలా అంటే చాలా క్లోజ్ గా ఉన్నారని వేణుకు, రాశికి మధ్య ఏదో సంబంధం ఉందన్న గుసగుసలు ఇండస్ట్రీలో గట్టిగా వినిపించాయి.
వీరిద్దరూ సెట్స్ లో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉండడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందన్న పుకార్లు గట్టిగా వచ్చాయి. అయితే తన ఇద్దరు మంచి స్నేహితులమని తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. అలాగే వేణుకు తన తొలి సినిమా హీరోయిన్ లయ విషయంలోనూ చాలా అంటే చాలా క్లోజినెస్ ఉందన్న గుసగుసలు అప్పట్లో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.