ఎస్ ప్రజెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఏ ఇండస్ట్రీలోనైనా సరే మా హీరో నెంబర్ వన్ అంటే మా హీరో తోపు అంటూ ఫ్యాన్స్ గొడవ పడుతూ ఉంటారు. దానికి తగ్గట్టే హీరోలు కూడా ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి రకరకాల పాత్రలను పోషిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు . వాళ్లు రిస్క్ చేసిన ప్రతి హీరో సక్సెస్ అవుతాడా..? అంటే నో అనే చెప్పాలి కానీ ఎంతో అదృష్టం హార్డ్ వర్క్ ఉంటే కానీ అలా సక్సెస్ అవ్వలేరు.
అలా చేసి సక్సెస్ అయిన వాళ్ళల్లో మన బన్నీ కూడా ఒకడు . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతటి హార్డ్ వర్కర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గంగోత్రి సినిమా చూసి పుష్ప సినిమా చూస్తే ఆయనలోని చేంజెస్ బాగా కనిపిస్తాయి . కాగ రీసెంట్గా పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు వరించింది . గత 69 ఏళ్లుగా తెలుగు అభిమానుల కంటున్న కల నిజం చేసి సంచలనం సృష్టించాడు అల్లు అర్జున్ .
ఇలాంటి క్రమంలోనే దేశంలో ఎక్కువ ఆకర్షణ ప్రభావం ఉన్న స్టార్లుగా అల్లు అర్జున్ నెంబర్ వన్ స్లాట్ లో ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది . నిజానికి ఈ ప్లేస్ లో కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ తీసుకుంటూ వచ్చారు. కానీ ఫస్ట్ టైం ఓ తెలుగు హీరో ఈ ప్లేస్ లో నిలబడ్డాడు . హీరోయిన్స్ లో దీపిక పదుకొనే ఈ పొజిషన్ను దక్కించుకునింది . మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ అనేది వివిధ రంగాలలో భారతీయ ప్రముఖుల ప్రజాదరణ ప్రభావాన్ని అంచనా వేయడానికి వార్షిక ప్రమాణం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఇందులో సినీ ప్రముఖుల పేర్లు హైలెట్గా మారాయి. కాగా రీసెంట్గా 2023లో జరిగిన సర్వేలో దీపిక 25% ఓటర్లు సాధించి భారతదేశానికి చెందిన అత్యంత ప్రభావంతమైన స్థానాన్ని నిరూపించుకునింది . అంతేకాదు అల్లు అర్జున్ నెంబర్ ఆరు శాతం ఓట్లతో నెంబర్ వన్ హీరోగా నిలిచారు. దీనికి కారణం అల్లు అర్జున్ నటించిన పుష్పరాజ్ పాత్ర అని చెప్పక తప్పదు..!!