Newsదేశ ప్ర‌ధానికి మ‌న‌వ‌రాలు... నాగార్జున హిట్ హీరోయిన్‌... మ‌ద్యంతో కెరీర్ మ‌టాష్‌...!

దేశ ప్ర‌ధానికి మ‌న‌వ‌రాలు… నాగార్జున హిట్ హీరోయిన్‌… మ‌ద్యంతో కెరీర్ మ‌టాష్‌…!

మనీషా కొయిరాలా ఈ పేరు తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నెల్లూరు నెరజాణ‌ అంటూ తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఆమె నటించిన సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. మనీషా కొయిరాల ఒకప్పుడు తిరుగులేని అందం.. అభినయం ఆమె సొంతం. బాలీవుడ్ సినీ ప్రపంచంలో ఆమెకు సరితూగే నటి అప్పట్లో మరొకరు లేరనే చెప్పాలి.

బాంబే – ఇండియన్ లాంటి సినిమాలతో ఇటు తమిళంలో కూడా ఆమె తిరుగులేని స్టార్డం సొంతం చేసుకుంది. మనీషా నేపాల్ లోని కోయిరాల సంపన్న కుటుంబంలో జన్మించిన అమ్మాయి. నేపాల్‌లో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన తొలి ప్రధాని మనవరాలు కావటం విశేషం. అక్కడ రాజకీయ పరిస్థితులు దిగజారడంతో మనిషా తల్లిదండ్రులు భారత్‌కు వలస వచ్చి వారణాసిలో స్థిరపడ్డారు. ఆ తర్వాత పదో తరగతి వరకు ఇండియాలో చదివిన ఆమె నేపాల్‌కు వెళ్లి ఓని అనే సినిమాతో సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది.

తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి మోడలింగ్ పై దృష్టి పెట్టి బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుంది. బాలీవుడ్లో తిరిగిలేని హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తన వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ కాలేదు. నేపాలికి చెందిన సామ్రాట్ దహాల్‌తో 2010లో ఆమెకు పెళ్లి జరగగా.. పెళ్లయిన ఆరు నెలలకే భేదాభిప్రాయాలు రావడంతో 2012లో వీరు విడాకులు తీసుకున్నారు.

తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో బ్యాక్ టూ ఖాట్మాండ్ అంటూ తల్లిదండ్రులతో విమానంలో వెళుతున్న ఫోటోలు పంచుకుంది. తాజా ఫోటోలో ఆమెను చూస్తే అస్సలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. సినిమాల్లోకి వచ్చాక ఒత్తిడికి గురైన మనిషా మద్యానికి బానిసగా మారింది. దీనికి తోడు విడాకుల తర్వాత మరింత తాగటం మొదలుపెట్టింది. చివరకు ఆమె వ్యక్తిగత అలవాట్ల వల్ల క్యాన్సర్ భారిన పడింది.

క్యాన్సర్ తో పోరాడి ఆమె గెలిచింది మనిషా కు గర్భాశయ క్యాన్సర్ చివరి దశలో ఉన్నట్టు తేలింది. ఆమె జీవితం అంతా ముగిసిపోయిందని భావించారు. కానీ ఆమె క్యాన్సర్‌ను జయించి పోరాట యోధురాలిగా నిలిచింది. ఆమె తెలుగులో నాగార్జునకు జోడిగా క్రిమినల్ సినిమాలో నటించింది. ఈ సినిమా మహేష్ భ‌ట్ డైరెక్షన్ లో తెర‌కెక్కి సూపర్ డూపర్ హిట్ అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news