Movies"AAA" సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె పేరు కూడా "A"...

“AAA” సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె పేరు కూడా “A” తోనే స్టార్ట్ అవుతుంది..చెప్పుకోండి చూద్దాం..!!

ఆర్ ఆర్ ఆర్ ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన ఆస్కార్ అవార్డును తీసుకొచ్చింది . ఆర్ – రామ్ చరణ్.. ఆర్ – రాజమౌళి.. ఆర్ – తారక రామారావు ఇలా ముగ్గురు పేరు కలిసొచ్చేలా ఈ పేరు పెట్టుకున్న రాజమౌళి ..ఈ సినిమాతో ఎన్నో ప్రభంజనాలు సృష్టించారు . అయితే ఆర్ఆర్ఆర్ లాగే ఇప్పుడు ఇండస్ట్రీలో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది .

ఆ సినిమా మరేదో కాదు. ఏ ఏ ఏ ఎస్ ప్రసెంట్ ఇదే హాష్ ట్యాగ్ ట్రెండింగ్ మారింది. ఈ కాంబో ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది . అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించ బోయే సినిమా . ఆల్మోస్ట్ ఆల్ అఫీషియల్ ప్రకటన రేపో మాపో వచ్చేస్తుంది అన్నంత రేంజ్ లో ఈ సినిమా పై హ్యూజ్ బజ్ క్రియేట్ అయిపోయింది. అంతేకాదు ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ ఫిక్సయినట్లు తెలుస్తుంది .

అంతేనా ఈ సినిమాకి మరో ఏ లెటర్ కలిసి వచ్చేలా అల్లు అర్జున్ లక్కీ బ్యూటీ .. ఆయన ఎప్పటినుంచో సినిమా చేయాలి అంటూ వెయిట్ చేస్తున్న హీరోయిన్ బాలీవుడ్ హాట్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ ను ఈ సినిమాలో కీలకపాత్రలో చూస్ చేసుకున్నారట . అంతేకాదు ఈ సినిమాలో మొత్తంగా ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారు అంటూ తెలుస్తుంది . వాళ్లలో ఒకరు= ఐశ్వర్యరాయ్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు మరో రోల్ కోసం దీపికా పదుకొనేను చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది .

మరో రోల్ కోసం ప్రియాంక చోప్రాను సెలెక్ట్ చేసుకున్నారట . ముగ్గురు బాలీవుడ్ బ్యూటీస్ ని చూస్ చేసుకున్న అట్లీ అల్లు అర్జున్ తో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రేంజ్ లో ఉండే స్పెషల్ స్టోరీని తెరకెక్కించబోతున్నారు అంటూ తెలుస్తుంది. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ రికార్డులను బద్దలు కొట్టే రేంజ్ లో ఏ ఏ ఏ ఉండబోతుంది అంటూ ఫ్యాన్స్ ఇప్పటినుంచి సంబరాలు చేసుకుంటున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news