ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా పేరే మారు మ్రోగిపోతుంది . దానికి కారణం రీసెంట్గా నటించిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకు రావడమే. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విజయ్ వర్మ సైతం అదే న్యూస్ కన్ఫామ్ చేశాడు . హీరోయిన్ తమన్నా తో డేటింగ్ చేస్తున్నానని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు .
ఈ క్రమంలోనే ఈ ఇద్దరి పేర్లు ఇండస్ట్రీలో మారు మ్రోగి పోతున్నాయి . అంతేకాదు నిన్న మొన్నటి వరకు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట ఇప్పుడు పబ్లిక్ గానే చట్టపట్టలేసుకొని తిరిగేస్తుంది. రీసెంట్ గానే మాల్దీవ్స్ వెకేషన్స్ ను జబర్దస్త్ గా ఎంజాయ్ చేసి దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఈ జంట . ఈ క్రమంలోనే విజయ్ వర్మ తమన్నా ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు.
దీంతో విజయవర్మ – తమన్నా లను జనాలు పలు రకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు అక్కడి వాళ్ళు. ఇదే క్రమంలో ఎయిర్ పోర్ట్ లో కనిపించిన తమన్నాను కొందరు రిపోర్టర్స్ ప్రశ్నిస్తూ “విజయ్ సార్ ఎక్కడ మేడం.. బాగా ఎంజాయ్ చేశారా..?” అంటూ క్వశ్చన్ చేశారు . అయితే ఏ మాత్రం సమాధానం ఇవ్వని తమన్నా.. సైలెంట్ గా వెళ్ళిపోయింది . ఇదే ప్రశ్నను తర్వాత వచ్చిన విజయ్ వర్మను ప్రశ్నించారు . “తమన్నా మేడం తో మస్తు మజా చేశారా ..?” అంటూ ఓ అభిమాని ప్రశ్నించారు .. దీంతో ఫైర్ అయిపోయిన విజయ్ వర్మ ..”తప్పుడు మాట అలా మీరు మాట్లాడకూడదు ” అంటూ కోపంగా రిప్లై ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!!