Moviesరు. 1000 కోట్లు ఇస్తాం… పుష్ప 2 సినిమాకు క‌ళ్లు జిగేల్‌మ‌నే...

రు. 1000 కోట్లు ఇస్తాం… పుష్ప 2 సినిమాకు క‌ళ్లు జిగేల్‌మ‌నే ఆఫ‌ర్‌… డ‌బ్బే డ‌బ్బు..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన సినిమా పుష్ప ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ లో రు. 100 కోట్లకు పైగా వ‌సూళ్లు కొల్లగొట్టింది. పుష్ప అలాంటి ఇలాంటి సంచలనాలు నమోదు చేయలేదు. పుష్ప ఒక మేనరిజం అయిపోయింది. ఇప్పుడు పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 వ‌స్తోన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే చాలా వరకు పుష్ప 2 షూటింగ్ పూర్తయింది. తొలి పార్ట్‌ అంచనాలకు మించి విజయం సాధించడంతో పుష్ప 2 విషయంలో దర్శకుడు సుకుమార్ ఎక్కడ రాజీ పడటం లేదు. ఈ సినిమాకు 500 నుంచి 600 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టు తెలుస్తోంది. సినిమా మేకింగ్ ద‌శ‌లో ఉండగానే బాలీవుడ్ కి చెందిన ఒక టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచి ఈ సినిమా నిర్మాతలకు అదిరిపోయే ఆఫర్ వెళ్ళినట్టు తెలుస్తుంది.

రు.1000 కోట్లు ఇస్తాం.. పుష్ప 2కు సంబంధించిన అన్ని రైట్స్ తమకు ఇచ్చేయాలని భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి పుష్పాడ్ 2 సినిమా నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండా ఇలాంటి బంపర్ ఆఫర్ అంటే మామూలు విషయం కాదు. తాజాగా బన్నీకి జాతీయ అవార్డు కూడా రావడంతో పుష్ప 2పై ఆకాశాన్ని అంటే అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కానుక ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news