టాలీవుడ్ స్వీటీ అనుష్క, చెన్నై చిన్నది సమంత ఇద్దరు ముదురు ముద్దుగుమ్మలు అయిపోయారు. టాలీవుడ్ లో దశాబ్ద కాలానికి పైగా స్టార్ హీరోయిన్ లాగా ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు ఫేడ్ అవుట్ దశకు దగ్గరలో ఉన్నారు. అనుష్క వయసు 40 సంవత్సరాలు దాటేసింది. సమంత కూడా మూడున్నర పదుల వయసుకు చేరువైంది. తాజాగా ఈ ఇద్దరు ముదురు ముద్దుగుమ్మలు నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
విజయ్ దేవరకొండకు జోడిగా సమంత నటించిన ఖుషి – అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వారం రోజుల తేడాలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే యుఎస్ లో ఖుషి సినిమా వన్ మిలియన్ డాలర్ల మార్క్ దాటింది. పైగా అందరూ విజయ్ దేవరకొండ క్రెడిట్ తో పాటు దర్శకుడు శివ నిర్వాణ క్రెడిట్ చాలా ఉంది.
ఖుషికి అక్కడ వన్ మిలియన్ డాలర్ల వసూళ్లు రావడంలో సమంత గొప్పతనం ఏం లేదని చెప్పాలి. అయితే మిస్ సెట్టి సినిమాలో మెయిన్ రోల్ అనుష్కదే. కేవలం అనుష్క ని చూసే ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటికే అక్కడ ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్ టచ్ చేసింది.
పైగా సాలిడ్ వీకెండ్ కూడా కలిసి వచ్చేలా ఉంది. అనుష్క ఓన్ క్రేజ్‌తో యూఎస్లో అదిరిపోయే వసూళ్లు రాబడితే.. అటు సమంత సినిమాకు విజయ్, శివ తోడు ఉండి కూడా వన్ మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. దీనిని బట్టి చూస్తే సమంతతో పోలిస్తే అనుష్కకే ఇంకా ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పాలి.