ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు జనాలు. చిన్న పెద్ద తేడా లేకుండా.. కులమత బేధాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే జనాలు రాఖీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ సోదరీ సోదరీమణులకు తమ తోబుట్టువులకు రాఖీ కట్టి ఆశీర్వదించి బహుమతులు అందుకున్నారు . అయితే చాలామందికి రాఖీ పండుగ అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది . అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది . రాంగోపాల్ వర్మ రాఖీ కడితే వాళ్ళ సిస్టర్ కి ఏమి ఇస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
అదేంటి రాంగోపాల్ వర్మ కూడా మనలా మనిషి కదా అని అనుకుంటున్నారా..? అవును మనలాంటి మనిషి అయిన చాలా తేడా మనిషి అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. సెంటిమెంట్.. ఎమోషన్స్ అలాంటివి ఉండవని అతడే ఒప్పుకున్నారు . అయితే వర్మ తన సోదరి రాఖీ కడితే ఎలా ఫీల్ అవుతాడు అనే విషయం రీసెంట్ గా బయటపడింది . రాంగోపాల్ వర్మ సోదరి విజయలక్ష్మి రాఖీ పండుగ సందర్భంగా అనేక విషయాలను పంచుకున్నారు .
రాంగోపాల్ కి రాంగోపాల్ వర్మకి కూడా సెంటిమెంట్ ఎమోషన్స్ ఉంటాయట . కానీ అవి అందరిలాగా కాదని తెలిపింది . తన పనులకు ఆటంకాలు కలిగించే సెంటిమెంట్స్ వర్మ ఫాలో అవ్వడట. రాఖీ పండుగ అంటే వర్మకు ఎన్నో విచిత్రమైన అనుబంధాలు ఉన్నాయట. రాఖీ కడతాను అంటే కచ్చితంగా తిడతారు .. అదే ఆయన ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వెళ్లి చేతికి సైలెంట్ గా రాఖీ కడితే చూసి థ్రిల్ అవుతారు . అదే కాసేపు ఫోన్ పక్కన పెట్టు రాఖీ కడతానంటే మాత్రం తిట్టేస్తారు.. తన పనికి ఎవరు ఆటంకం కలిగించిన ఒప్పుకోరు.. రాఖీ కట్టినప్పుడు నాకు గిఫ్ట్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయను ..రాఖీ కట్టడమే పెద్ద గిఫ్ట్ ఇంకా నాకు రాంగోపాల్ వర్మ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చింది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!