ఎస్ ఎస్ తమన్ దివంగత లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల బలరామయ్య మనవడిగా మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తాడు. కెరీర్ ప్రారంభంలో చకచక సినిమాలు చేసుకుంటూ వెళ్లేవారు. తమను ఒక సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు అంటే చాలా తక్కువ టైం తీసుకునేవాడు.. మ్యూజిక్ క్వాలిటీ ఉండేది. అందుకే స్టార్ హీరోల సైతం తమన్‌తో వర్క్ చేయించుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపేవారు.
అయితే ఇటీవల కాలంలో తమన్ పేరులో మార్పు వచ్చేసింది. అందరూ స్టార్ హీరోలు తన వెంటే పడుతూ ఉండడంతో తమన్‌లో క్వాలిటీ తగ్గిపోయింది. క్వాలిటీ సంగతి కాస్త పక్కన పెడితే అసలు అనుకున్న టైం కి కూడా మ్యూజిక్ ఇవ్వటం లేదని అంటున్నారు. స్టార్ హోటల్ లో మకాం పెట్టి అక్కడ టైం వేస్ట్ పనులు చేస్తూ కాలం గడిపేస్తున్నాడని.. ట్యూన్స్ దగ్గరికి వచ్చేసరికి పాత ట్యూన్‌లే అటు ఇటు తిప్పి ఇచ్చేస్తున్నాడన్న విమర్శలు బాగా ఎక్కువగా వస్తున్నాయి.
అసలు గుంటూరు కారం సినిమాకు తమన్‌ను కొనసాగించడం మహేష్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. కేవలం త్రివిక్రమ్ బలవంతం మీదే మహేష్ తమన్‌ను కొనసాగిస్తూ వస్తున్నాడు. తాజాగా ఓజీ టీజర్ వచ్చింది. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే కమలహాసన్ విక్రమ్ సినిమాను కాపీ కొట్టేసినట్టు ఉందన్న సెటైర్లు పడుతున్నాయి. ఎస్ఎస్ తమన్ అంటే సేమ్ టు సేమ్ థమన్ అంటూ సోషల్ మీడియాలో దారుణంగా విమర్శలు చేస్తున్నారు.
అయిన తమన్ తీరులో ఎంత మాత్రం మార్పు రావడం లేదు. పాటలకు కూడా సరైన మ్యూజిక్ ఇవ్వటం లేదు. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ కలిసి చేసిన మల్టీ స్టార్ బ్రో సినిమా పాటలు ఎంత అట్టర్ ప్లాప్ అయ్యాయో చూసాం. ఇక నేపథ్య సంగీతం కూడా సరిగా రాలేదు. ఇప్పుడు గుంటూరు కారం సినిమా విషయంలో కూడా ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని సరైన ఔట్పుట్ రావటం లేదని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఏది ఏమైనా తమన్ తీరు మార్చుకోకపోతే అవుట్ డేటెడ్ అయిపోయే కాలం దగ్గర పడిందని చెప్పాలి.