రీసెంట్ గా టాలీవుడ్ లో జరిగిన ఓ ముద్దుఘటన చిన్నపాటి వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఓ ప్రెస్ మీట్ లో దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి హీరోయిన్ మన్నారాను ముద్దు పెట్టుకున్నాడు. ఆమె భుజాలపై చేయి వేసి గట్టిగా పట్టుకుని బుగ్గపై ఓ ముద్దు పెట్టాడు. ఊహించని ఘటనతో మన్నారా షాక్ అయింది. ఆ వెంటనే తేరుకుని నవ్వేసింది. మీడియా ముందు దర్శకుడు చేసిన ఈ పనిపై విమర్శలు వచ్చాయి.
అయితే దీనిపై దర్శకుడు రవికుమార్ స్పందిస్తూ మన్నారాను ముద్దుపెట్టుకుంటే తప్పేంటి అని ప్రశ్నించాడు. ఆప్యాయతతోనే అలా చేశానని తన కూతుర్ని కూడా అలాగే ముద్దు పెట్టుకుంటానని చెప్పాడు. అయినా ఆమెకు లేని ప్రాబ్లం మీడియాకు ఎందుకంటూ ? కాస్త గట్టిగా మాట్లాడాడు. ఈ వ్యవహారంపై హీరోయిన్ కూడా స్పందించింది. డైరెక్టర్ చేసిన పనిని సమర్థించింది.
ఆయన తప్పుడు ఆలోచనతో అలా చేయలేదు.. మొదటి నుంచి ఆయన తనను బేటి బేటి అని పిలుస్తాడని.. అదే ఆప్యాయతతో ఆరోజు అలా భుగ్గపై ముద్దు పెట్టి ఉంటాడని మన్నారా తెలిపింది. డైరెక్టర్ పెట్టిన ముద్దులో తనకు తప్పు కనిపించలేదని ఆమె స్పష్టం చేసింది.
అలా మీడియా ముందు ముద్దు పెట్టేసరికి కాస్త కంగారుపడ్డానే తప్ప అందులో ఎలాంటి చెడు ఆలోచనలు కనిపించలేదని.. ఈ ఘటనలో ఎలాంటి వివాదం లేదని తేల్చేసింది ఈ బ్యూటీ. అలాగే ముద్దుపై అనవసరంగా కెలుకుతున్న మీడియాకు ఆమె ఘాటుగానే కౌంటర్ కూడా ఇచ్చింది.