సాధారణంగా.. హర్రర్ మూవీలంటే.. హీరోహీరోయిన్లకు ఆసక్తి ఎక్కువ. ప్రేక్షకులు విరగబడి మరీ థియే టర్లకు వస్తారని.. సినిమాను ఆదరిస్తారని వారు నమ్మేవారు. ఈ క్రమంలోనే బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే హర్రర్ మూవీలు వచ్చాయి. అయితే.. ఈ సినిమాల విషయంలో శోభన్‌బాబు, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ వంటివారు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ, హీరో కృష్ణ మాత్రం కోరి మరీ .. ఇలాంటి హారర్ మూవీల్లో నటించేవారు.
ఇదే విషయాన్ని ఒక సందర్భంలో అక్కినేని ప్రస్తావిస్తూ.. మనం ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తాం. ప్రేక్షకుడు కూడా ఎంతో ఖర్చు పెట్టి.. సమయం వెచ్చించిథియేటర్లకు వస్తాడు. అలాంటిప్రేక్షకుడి దగ్గర డబ్బులు తీసుకుని భయ పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి? అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. హరర్ మూవీలతో ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటని కూడా ఆయన ప్రశ్నించేవారు. ఇక ఎన్టీఆర్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసేవారు.
హారర్ మూవీలంటే.. అన్నగారికి చిరాకు. పైగా ఆయన ఇష్టపడేవారు కాదు. ఇలాంటి సమయంలోనే.. కృష్ణ దీనిని తనకు అవకాశంగా మార్చుకున్నారు. అనేక సినిమాల్లో ఆయన నటించారు. అవేకళ్లు ఈ పరంపరలో వచ్చిన హారర్ మూవీనే. ఇది సూపర్ హిట్ అయింది. తర్వాత.. కూడా కృష్ణ హారర్ మూవీల వైపు మొగ్గు చూపారు. తర్వాత.. నేరుగా తెలుగులో తీసిన హర్రర్మూవీ.. కాష్మోరా. దీనిలో రాజేంద్రప్రసాద్నటించారు.