Moviesవార్నీ..ఆఖరికి మహేశ్ బాబు కూడా..సినిమా హిట్ అవ్వాలని అలాంటి పనులు చేసాడా..?

వార్నీ..ఆఖరికి మహేశ్ బాబు కూడా..సినిమా హిట్ అవ్వాలని అలాంటి పనులు చేసాడా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పాత విషయాలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు .. అందుకే సెలబ్రిటీస్ ఏం చేసినా చెల్లేవి ..ఓ మాట చెప్పినా అది నిజమో అబద్దమో తెలియని పరిస్థితులు ఉండేవి . కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమంటూ ఏ హీరో ఏం చెప్పినా సరే అది నిజమా లేక అబద్ధమా అని పాత రోజులకు వెళ్లి సెర్చ్ చేసి మరి కన్ఫామ్ చేసేస్తున్నారు అభిమానులు . రీసెంట్గా టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి కలిసి ఉన్న ఫొటోస్ వైరల్ గా మారాయి.

మనకు తెలిసిందే వేణు స్వామి ఏది చెప్తే అది జరుగుతుంది అని ఇండస్ట్రీలో నమ్మకం ఏర్పడింది . రీసెంట్గా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు విషయం మరోసారి అదే విషయాన్ని ప్రూవ్ చేసింది. ఆయన ముందుగానే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు చంద్రబాబు అని చెప్పుకొచ్చాడు ..దీంతో మరోసారి సోషల్ మీడియాలో వేణు స్వామి పేరు వైరల్ గా మారింది . కాగా వేణు స్వామి మహేష్ బాబుతో కలిసి పూజలు చేయించాడు . దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి .

అయితే ఇది ఓ సినిమా షూటింగ్ కి సంబంధించిన పూజా కార్యక్రమం అంటూ తెలుస్తుంది . కానీ కొంతమంది మాత్రం మహేష్ బాబు హిట్ కోసమే వేణు స్వామితో పూజలు చేయించుకున్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు . అయితే అలాంటి వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని .. కేవలం సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలలో మాత్రమే వేణు స్వామి పాల్గొన్నారు అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ క్లారిటీ ఇస్తున్నారు. అంతేకాదు మహేష్ బాబు టాలెంటెడ్ అని ఏ పూజలు చేస్తే ఏ వ్రతాలు చేస్తే ఐనిమా హిట్ అవుతుందని అనుకోడని ఆయన టాలెంట్ పై ఆయనకు నమ్మకం ఉందని చెప్పుకొస్తున్నారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో మహేష్ బాబు – వేణు స్వామి ల పేర్లు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news