Moviesదామినితో బిగ్ బాస్ అలాంటి అగ్రిమెంట్ రాయించుకుందా..? అందుకే అంత త్వరగా...

దామినితో బిగ్ బాస్ అలాంటి అగ్రిమెంట్ రాయించుకుందా..? అందుకే అంత త్వరగా తరిమేసిందా..?

తెలుగు టెలివిజన్ చరిత్రలో అతిపెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్.. ప్రజెంట్ ఏడవ సీజన్ రన్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి దామని ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది . హౌస్ లో హైడ్రామాల మధ్య జరిగిన ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఫైనల్లీ ఓట్లు తక్కువ దక్కించుకోకపోయిమ దామిని హౌస్ నుండి బయటకు వచ్చేసింది.

ఎప్పుడు విధంగానే బిగ్ బాస్ ఓట్లు తక్కువ వచ్చిన కంటెస్టెంట్ లని కాకుండా తనకు ఇష్టం లేని కంటెస్టెంట్ లని ఎలిమినేట్ చేస్తూ ఉంటాడు అన్న కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈసారి కూడా దామిని హౌస్ లో ఉండటం వల్ల హౌస్ లో ఉన్న పెద్దగా ఉపయోగం లేదు అని .. బిగ్ బాస్ ఆమెకు ఓట్లు వచ్చినా కానీ ఆమె ఎలిమినేట్ చేసేసారు అంటూ ప్రచారం జరుగుతుంది .

అంతేకాదు దామిని సైతం బిగ్బాస్ పై ఫైర్ అవుతున్నట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఆమెను అసలు హౌస్ లో కి వెళ్లేముందే ఎక్కువ వారాలు ఉండేలా మాట్లాడుకున్నారని.. కానీ అసలు ఇలా తక్కువ వారాలకి ఎలిమినేట్ చేసేస్తారని అస్సలు ఊహించలేదు అని.. అందుకే బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్ళకూడదు అంటూ ఉంటారని ఫైర్ అయిపోయిందట . ప్రజెంట్ ఇవే వ్యాఖ్యలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news