సినిమా ఇండస్ట్రీలో కొందరి నటులను మనం ఎప్పటికీ మర్చిపోలేం. వాళ్ళు ఈ లోకాన్ని విడిచి ఏళ్ళు గడుస్తున్నా సరే ఇంకా వాళ్ళు మన మధ్యనే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది . అలాంటి ఓ టాప్ యాక్టర్ అచ్యుత్. ఈ పేరు చెప్తే ఈ కాలం జనరేషన్ వాళ్లకు గుర్తుపట్టలేకపోవచ్చు . కానీ మీ ఇంట్లో ఉండే నాన్నలు.. అమ్మలు.. అమ్మమ్మలకు చెప్తే ఈ పేరు వినగానే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు పడిపోతాయి . అంత ఓ గొప్ప నటుడు. ఆయన మరణం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గానే ట్రెండ్ అయింది.
పలు సీరియల్స్ లో సినిమాలల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అచ్యుత్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం అప్పట్లో యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది . అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైం లోనే స్టార్ స్టేటస్ అందుకున్న అచ్యుత్ త్వరలోనే మరింత ఎత్తుకు ఎదుగుతారని అంతా అనుకున్నారు . కానీ ఆ దేవుడు ఆయనను చిన్న వయసులోనే తీసుకెళ్లిపోయారు.
అయితే అచ్యుత్ మరణం సహజ మరణం కాదు అని ఇండస్ట్రీలో తన ఫ్రెండ్ అయినా హీరో ఆయనను మానసికంగా క్షోభకు గురిచేసి ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చేలా చేశారని .. ఆయన పెట్టిన బాధలు కారణంగానే హెల్తీగా ఉన్న అచ్యుత్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని .. మరి ముఖ్యంగా సదెన్ గా హార్ట్ అటాక్ రావడం ద్వార ఆయన మరణించారని అప్పట్లో వార్తలు వినిపించాయి . అయితే దీనంతటికీ కారణం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన ఫ్రెండ్ అయిన స్టార్ హీరో అని అప్పట్లో ప్రచారం జరిగింది . ఆశ్చర్యం ఏంటంటే అచ్యుత్ అచ్యుత్ మరణించినప్పుడు వచ్చి మీడియా ముందు నంగనాచి ముసలి కన్నీరు కార్చుకొని.. ఆ హీరో నాలుగు మంచి ముక్కలు చెప్పేసి ఆ తర్వాత అచ్యుత్ ఫ్యామిలీ ఎలా ఉందో ..? ఏమైందో..? పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ప్రజెంట్ మరోసారి అభిమానులు ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!