సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్లు హీరోయిన్లు – దర్శకులు, హీరోయిన్లు.. నిర్మాతలు కాస్త సన్నిహితంగా ఉన్న లేక ఒకరు తమ సినిమాలలో పదేపదే ఒక హీరోయిన్ ను రిపీట్ చేస్తున్నా వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందన్న అనుమానాలు సహజంగానే ఉంటాయి. అయితే ఈ అనుమానాలు ఇప్పటినుంచే కాదు గత కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నాయి. ఒక హీరోయిన్ ఇద్దరు స్టార్ దర్శకుల సినిమాలలో ఎక్కువగా నటిస్తూ వారితో గురు శిష్యురాలిలా సంబంధంతో కొనసాగిస్తూ ఉండడంతో ఆమె భర్త ఆమెను తీవ్రంగా అవమానించి ఎంతో వేదనకు గురి చేశారు.
ఆ హీరోయిన్ ఎవరో కాదు అలనాటి మేటి హీరోయిన్ సుజాత. ఆ దర్శకులు ఎవరో కాదు బాలచందర్ – దాసరి నారాయణరావు. బాలచందర్ కు ఏ హీరోయిన్ అయినా నచ్చితే ఆ హీరోయిన్‌ను స్టార్ హీరోయిన్ స్టేజ్ కు తీసుకు వెళ్లే వరకు నిద్రపోయేవారు కాదట. సరిత, సుజాత అలాగే ఆయన చేతిలో చెక్కిన శిల్పాలుగా ఎదిగిన వారే. ఆ తర్వాత తెలుగులో దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా సుజాతకు ఎన్నో అవకాశాలు ఇచ్చే ప్రోత్సహించారు.
వీరిద్దరి సినిమాలలో ఎక్కువగా నటించినా సుజాత వారిని తన గురువులుగా భావించింది. అయితే గురువుల రుణం తీర్చుకునే క్రమంలో సుజాత వల్ల ఇళ్లల్లో శుభకార్యాలు.. ఇతర ఫంక్షన్ లు జరిగినప్పుడు అక్కడ ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవారట. ఇది నచ్చని సుజాత భర్త మధుకర్ ఆమెను విపరీతంగా టార్చర్ పెట్టేవాడట. నీకు వారిద్దరితో సంబంధాలు ఉన్నాయా ? చెప్పు అసలు ఎంతమందితో నీకు లింకులు ?ఉన్నాయి అని దారుణమైన పదజాలంతో విపరీతంగా టార్చర్ పెట్టేవాడట.
చివరకు ఆమె ఆస్తులన్నీ తీసుకొని అతడు ఎర్నాకులం వెళ్లిపోగా.. సుజాత తన కొడుకు సుజిత్ తో కలిసి చెన్నైలోనే ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె క్యాన్సర్ బారిన పడింది. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా కనీసం చికిత్స కూడా తీసుకోకుండా అలాగే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడే తన భర్త తన రేంజ్‌కు సరితూగకపోయినా అందంగా ఉన్నాడు తన వెంట పడుతున్నాడు అన్న కారణంతో అతడికి మనసిచ్చి పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేసిందని ఆమె సన్నిహితులు చెబుతూ ఉంటారు.