Movies"సడెన్ గా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవడానికి కారణం అదే".. ఇన్నాళ్లకు అసలు...

“సడెన్ గా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవడానికి కారణం అదే”.. ఇన్నాళ్లకు అసలు నిజాన్ని బయటపెట్టిన బబ్లు..!!

సినిమా ఇండస్ట్రీలో కొందరు కమెడియన్స్ స్టార్ హీరోలకి మించిన క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతూ ఉంటారు. అయితే ఎంత స్టార్ స్టేటస్ కి ఎదుగుతారో అంత త్వరగా కనుమరుగైపోతూ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తాడు బబ్లు. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బబ్లు.. ఎన్ని సినిమాల్లో నటించాడో చెప్పనవసరం లేదు . ఆయన నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు కేవలం కమెడియన్ గానే కాకుండా పలు ఎమోషనల్ సీన్స్ లో కూడా నటించి మెప్పించాడు బబ్లు .

సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోయిన ఆయన గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు. మళ్లీ రిఎంట్రికి సిద్ధమవుతున్నాడు . ఈ క్రమంలోనే ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అసలు ఇండస్ట్రీకి ఎందుకు దూరం కావాల్సి వచ్చింది అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు . “ఐదేళ్లకే సినిమాల్లోకి వచ్చాను. నా ఫస్ట్ సినిమా ముద్దుల మేనల్లుడు.. అందులో నాజర్ కొడుకుగా నటించ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా చాలా సినిమాలు చేశాను.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పలు క్యారెక్టర్స్ లో నటించాను .. నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు చిత్రం మూవీ చేశాను.. ఆ సినిమాతో నా కెరియర్ మారిపోయింది “.

“అయితే సడన్గా మా నాన్నగారు 2012లో చనిపోయారు అప్పటి నుంచి నేను డిప్రెషన్ కి లోనయ్యాను .. ఆ బాధ ను మర్చిపోవడానికి నేను బ్యాంకాక్ వెళ్లిపోయాను రెండేళ్లకు పైగా అక్కడే ఉన్నాను ..అలా సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి ట్రై చేస్తున్నాను. ప్రస్తుతం సొంతంగా ప్రాజెక్టు కూడా చేస్తున్నాను. అలాగే యాక్టింగ్ అకాడమీలో కూడా పనిచేస్తున్నాను . త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను .. లాక్ డౌన్ లో అమ్మాయిని ప్రేమించాను నిజానికి మా పెళ్లి ఈ ఏడాదిలోనే జరగాల్సింది కానీ.. రీసెంట్గా మా చెల్లి చచ్చిపోయింది ..ఆ కారణంగా వాయిదా వేసుకున్న “అంటూ చెప్పుకు వచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో బబ్లు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news