టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ రీసెంట్ గానే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు . కాగా వీళ్ళిద్దరూ కలిసి నటించిన ఫస్ట్ సినిమా మిస్టర్ . ఈ సినిమాలో భాగంగా ఇటలీ వెళ్ళిన వీళ్లు అక్కడ ప్రేమలో పడిపోయారు. దీంతో కొన్నాళ్లపాటు గుడ్డు చప్పుడు కాకుండా వీళ్ళ ప్రేమాయణం కొనసాగించారు . అయితే ఫైనల్లి తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించుకున్న ఈ జంట .. జూన్ 9వ తేదీ నాగబాబు నివాసంలో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్నారు .
నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి ఇటలీలో గ్రాండ్గా జరగబోతున్నట్లు తెలుస్తుంది . అయితే ఈ క్రమంలోనే నాగబాబుకు చిరంజీవి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారట . నిహారిక పెళ్లిలో చేసిన తప్పు నాగబాబును ఈ పెళ్లిలో చేయొద్దు అంటూ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారట. నిజానికి నిహారిక పెళ్లి ముహూర్తం కరెక్ట్ టయానికి జరగలేదు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ముహుర్తం సమయానికి చైతన్య ఆమె మెడలో తాళి కట్టలేదని.. వీళ్ళ ఫోటోషూట్ హంగామా తో పెళ్లి ముహూర్తాన్ని దాటించేసారని..
ఆ తర్వాత ఫోటోషూట్ అంతా అయిపోయాక తాళ్ళి కట్టారని .. ఆకారణంగానే వీళ్లువిడాకులు తీసుకున్నారని ప్రచారం ఎక్కువగా జరిగింది . అయితే వరుణ్ తేజ్ విషయంలో మాత్రం అలాంటి తప్పు జరగకుండా దగ్గరుండి అని నువ్వే చూసుకోవాలి అంటూ నాగబాబుకి చిరంజీవి స్ట్రిక్ట్ గా చెప్పుకొచ్చారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.