స్కంద హీరో రామ్ – దర్శకుడు బోయపాటి కాంబినేషన్ సినిమా స్కంద. బోయపాటి సినిమా అంటేనే ఒక బ్రాండ్ ఉంటుంది. ఇక బాలయ్యతో బోయపాటి తెరకెక్కించిన అఖండ సినిమా తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో స్కందపై ఒక రేంజ్ లో అంచనాలు ఉండాలి. అయితే ఎందుకో గాని ఈ సినిమాపై ఆ స్థాయిలో అంచనాలు కనపడటం లేదు. సినిమా రిలీజ్ కు రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.. ప్రమోషన్లు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి.
టీజర్ నుంచి ట్రైలర్ తాజాగా రెండో ట్రైలర్ కూడా వచ్చింది. ఒక్కోసారి ఒక్కో స్టైల్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అన్నిటిలోనూ కామన్ గా ఉన్నది యాక్షన్. ఆ యాక్షన్ సీన్లు అయితే మామూలుగా లేవు. బోయపాటి లైన్ ను ఆయనే క్రాస్ చేసి కొత్త లైన్ గీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అలాగే సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటికే రెండు ట్రైలర్లు వచ్చినా కథ ఏంటన్నది ? రివిల్ చేయలేదు.
అదే బోయపాటి స్పెషాలిటీ. సినిమాలో మాస్ మెచ్చే యాక్షన్ సీన్లు.. బోయపాటి స్టైల్ ఊచకోత ఫైట్లు మామూలుగా ఉన్నట్టు లేవు. బోయపాటి మార్క్ ఫ్యామిలీ.. ఆ ఫ్యామిలీ జనాలను టచ్ చేయటం ఇవన్నీ ట్రైలర్లో కనిపించాయి. పవర్ఫుల్ ఎమోషనల్ యాక్షన్ సినిమాగా స్కందకి తెరకెక్కినట్టు కనిపిస్తోంది. చిట్టూరి శ్రీను నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మరి బోయపాటి రామ్‌కు తనదైన మాస్ రేంజ్ హిట్ ఇస్తాడో లేదో చూడాలి.