ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ పేరు ఏ రేంజ్ లో వైరల్ గా మారుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాలీవుడ్ లో ఒక్కటంటే ఒక హిట్ కూడా కొట్టని జాన్వి కపూర్.. ప్రెసెంట్ టాలీవుడ్ లో దేవర అనే సినిమాలో నటిస్తుంది . ఈ సినిమా ద్వారానే తెలుగులో డెబ్యూ ఇచ్చింది జాన్వి కపూర్. ఈ సినిమాతో ఎలాగైనా సరే ఫస్ట్ క్రేజీ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి చాలా కుతుహల పడుతుంది. కాగా ఇలాంటి క్రమంలోనే జాన్వికపూర్ కు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా డెబ్యూ చేసే అవకాశం వస్తున్నాయట .
అయితే బోనీకపూర్ మాత్రం చాలా మంది హీరోలతో అవకాశాలు వస్తున్న కేవలం ఇద్దరి హీరోలతోనే తన కూతురు డెబ్యూ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ముఖ్యంగా విజయ్ దళపతి లేదా అజిత్ సినిమాల ద్వారానే జాన్వికపూర్ కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని బోనికపూర్ ఆశపడుతున్నారట . అయితే హీరో ధనుష్ సరసన నటించే అవకాశం జాన్వికపూర్ కి వచ్చిందని .. అయితే బోనికపూర్ మాత్రం ఆ హీరో సినిమాలో అస్సలు నటించొద్దు అంటూ తెగేసి చెప్పారట .
కేవలం ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలో చేయకపోయినా పర్లేదు ..నువ్వు ధనుష్ తో మాత్రం సినిమా చేయొద్దు అంటూ ముఖాన్నే చెప్పేసారట . ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే ఎందుకు బోనీకపూర్ – ధనుష్ పై ఇంత గుర్రుగా ఉన్నాడు అనేది అర్థం కావడం లేదు . కేవలం శ్రీదేవి – రజనీకాంత్ మధ్య ఉన్న అతి చనువే బోనికపూర్ – ధనుష్ తో సినిమాలు చేయనీకుండా ఆపేసిందా అన్న విషయం కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!