రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ప్రశాంత్ తో హీరోయిన్ రతిక నడుపుతున్న డబల్ గేమ్స్ టీవీలో చూస్తున్న జనాలు అందరికీ తెలిసిందే . ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ ని సపోర్ట్ చేస్తూ రతిక ని ట్రోల్ చేస్తూ చాలామంది జనాలు కామెంట్స్ చేస్తూ ఉండగా రీసెంట్గా దీనిపై ప్రశాంత్ పేరెంట్స్ స్పందించారు. ప్రశాంత్ పేరెంట్స్ మాట్లాడుతూ..” మా అబ్బాయి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినందుకు చాలా ఆనందంగా ఉంది . అంతేకాదు కష్టపడి ఆడుతాడు అని నమ్మకం మాకుంది.. బిగ్ బాస్ హౌస్ లో గొడవలు సహజమే కానీ నా బిడ్డని అమరదీప్ చౌదరి “ఏందిరా..?” అనడం నాకు అస్సలు నచ్చలేదు. రైతుబిడ్డ అని తక్కువ చేస్తున్నారా..? అంటూ ఫైర్ అయిపోయింది .
అంతేకాదు ప్రశాంత్ లవ్ సాంగ్ చేస్తే 700000 వచ్చాయని .. ఆ డబ్బులుతీసుకుని ఫ్రెండ్స్ మొత్తం చీట్ చేశారు అంటూ చెప్పుకొచ్చింది .అంతేకాదు అలా ఫ్రెండ్స్ మోసం చేశారని చచ్చిపోతూ ఉంటే నేనే కాపాడాను అని.. ఫోన్ కావాలి అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోమన్నానని.. రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడని చెప్పుకొచ్చారు. అంతేకాదు తిండి తిప్పలు లేకుండా చాలా నెలలు తిరిగాడు అంటూ కూడా చెప్పుకు వచ్చారు .
అయితే రతిక కావాలనే మా వాడిని వాడుకుంటుందని ..మా వాడి క్రేజ్ చూసి ఆమె ఎక్కువ కాలం హౌస్ లో ఉండాలని ట్రై చేస్తుందని .. అందుకే రాసుకొని పూసుకుని తిరుగుతుందని.. ప్రశాంత్ ప్రతి ఒక్కరిని అక్కా చెల్లెలానే భావిస్తారని.. ఆయనకు ఎలాంటి దురాలోచన లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రశాంత్ కు పెళ్లి చేయాలనుకుంటున్నామని బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక లైఫ్ లో కొంచెం సెటిల్ అయ్యాక వెంటనే పెళ్లి చేస్తామంటూ కూడా చెప్పుకు వచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ప్రశాంత్ పేరెంట్స్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!