Moviesఇంటికి వచ్చి ఆఫర్ ఇచ్చినా..స్టార్ డైరెక్టర్ మూవీని రిజెక్ట్ చేసిన మానస్.....

ఇంటికి వచ్చి ఆఫర్ ఇచ్చినా..స్టార్ డైరెక్టర్ మూవీని రిజెక్ట్ చేసిన మానస్.. ఎందుకంటే..?

మానస్ ..ఈ పేరు కు ఒకప్పుడు పరిచయాలు అవసరం . కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడో.. అప్పటినుంచి మానస్ అన్న పేరుకు కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది . మరి ముఖ్యంగా హౌస్ లో చాలా జెన్యూన్ గా చాలా కూల్ అండ్ ప్లెసెంట్ గా గేమ్ ఆడి టాప్ ఫైవ్ లో నిలిచాడు. అంతకుముందు పలు సీరియల్స్ లో నటించి మెప్పించిన మానస్ కు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత హ్యూజ్ రేంజ్ లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది .

ఈ క్రమంలోనే మానస్ కి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .. రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు . అయితే మానస్ తన లైఫ్ విషయంలో చాలా ముందుచూపుతో ఉంటాడు. ఎప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోడు. కానీ ఓ స్టార్ డైరెక్టర్ ఇంటికి వచ్చి అవకాశం ఇస్తానన్నా సరే రిజెక్ట్ చేశాడు .

ఈ విషయాన్ని ఆయనే ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు మారుతి . మారుతి గతంలో తెరకెక్కించిన ఈరోజుల్లో సినిమాల్లో మొదటగా హీరోగా అనుకునింది మానస్ నే అంటూ ఆయన చెప్పుకొచ్చారు . అయితే చాలా ఎక్కువ సేపు రిక్వెస్ట్ చేసిన సరే నేనే రిజెక్ట్ చేశానని ఓపెన్ గా చెప్పుకొచాడు. అప్పట్లో నాకు ఆయనపై నమ్మకం లేదని పెద్దగా పాపులారిటీ లేకపోవడంతో ఈ సినిమా ఎవరు చూస్తారు అని నేనే ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశానని.. ఈ సినిమా రిలీజ్ అయి హిట్ కొట్టిన తర్వాత చాలా చాలా బాధపడ్డాడని చెప్పుకొచ్చాడు. దీంతో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news