మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన ఇద్దరు కలిసి ఇటీవల ఫారిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు కుమార్తె క్లీన్ కారా పుట్టిన తర్వాత తొలిసారిగా బయటికి వెళ్లారు. అయితే వీరిద్దరూ ఎక్కడికి వెళ్లారు ? ఎందుకు వెళ్లారు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తాజాగా తన సోషల్ మీడియా పోస్టులతో ఉపాసన ఆ ప్రశ్నకు బదులు ఇచ్చేశారు. ఉపాసన పోస్టులు బట్టి ఇద్దరు ఫారిన్ ట్రిప్ వెళ్లారని.. మరో పోస్టులో ఒక వెడ్డింగ్ కార్డు ఇన్విటేషన్ షేర్ చేశారు
దీంతో ఫారిన్ కు మ్యారేజ్ కోసం వెళ్లారు అన్నది అయితే క్లారిటీ వచ్చేసింది. అయితే అది ఎవరు ? పెళ్లి అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే మెగా కుటుంబంలో కూడా పెళ్లి సందడి మొదలుకానున్న విషయం తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ యేడాది నవంబర్లో పెళ్లి చేసుకోనున్నారు. ఆ పెళ్లి పనులు కూడా రామ్ చరణ్ చూసుకుంటున్నట్టు సమాచారం.
వరుణ్ – లావణ్య పెళ్లిని కూడా ఫారిన్లోని చేయనున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి వేదిక పారిస్ కానుందని తెలుస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అక్కడికే వెళ్లడంతో ఆ పనులు మొదలు పెడుతున్నారు అని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ కూడా ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ లో ఉన్నాడు.
ఆఫ్రికాలో వారిని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే వరుణ్ తేజ్ తాజాగా గాండీవధరి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచాడు. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛంజెర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా సినిమా తెరకెక్కనుంది.