టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ఐకాన్ హీరో అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా “పుష్ప2” . లెక్కల మాస్టర్ గా పాపులారిటీ దక్కించుకున్న సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప వన్ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కబోతుంది . ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ వచ్చిన సరే జనాలలో తెలియని గూస్ బంప్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి.
కాగా రీసెంట్ గానే పుష్ప వన్ సినిమాకి గాను ఉత్తమ జాతీయ నటుడు అవార్డు వరించింది బన్నీకి అన్న సంగతి అందరికీ తెలిసిందే . అప్పటినుంచి పుష్ప2 పై మరింత హైప్స్ పెంచేసుకున్నారు అభిమానులు . కాగా ఇలాంటి క్రమంలోనే కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా ఎంతో ఆత్రుతగా వెయిట్ చేసిన పుష్ప2 సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది . ఆగస్టు 15 2024వ తేదీ ఈ సినిమాను గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు .
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తూ ఉంది . అంతేకాదు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని .. ఆమెను డైరెక్ట్ గా థియేటర్ లోనే చూపిస్తారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఈ సినిమాకు మరింత ప్లస్ గా దేవిశ్రీప్రసాద్ సంగీతం ఉండబోతుంది అంటూ పుష్ప వన్ సినిమాతోనే క్లారిటీ వచ్చేసింది . ఆగస్టు 15వ తేదీ 2024 పుష్ప2 సినిమా రిలీజ్ కాబోతుంది అంటూ మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించడంతో బన్నీ ఫాన్స్ పండగ చేసుకుంటున్నాడు. పుష్ప గాడిని మనం ఈసారి మరో లెవల్లో చూడబోతున్నాం అంటూ ట్రెండ్ చేస్తున్నారు..!!