Newsభోరుమ‌న్న పూజాహెగ్డే... ఓదారుస్తోన్న త్రివిక్ర‌మ్‌...!

భోరుమ‌న్న పూజాహెగ్డే… ఓదారుస్తోన్న త్రివిక్ర‌మ్‌…!

టాలీవుడ్ మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – పూజ హెగ్డే కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. త్రివిక్రమ్ తన చివరి రెండు సినిమాలలో పూజ హెగ్డేను హీరోయిన్గా రిపీట్ చేశారు. అలవైకుంఠపురంలో – అరవింద సమేత రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. గుంటూరు కారం సినిమాలోని మొదట ఆమెనే హీరోయిన్గా అనుకున్నారు. కొన్ని అనూహ్య‌ కారణాలవల్ల ఇటు మహేష్ బాబు ఒత్తిడి మేరకు త్రివిక్రమ్ అయిష్టంగానే పూజ హెగ్డేను ఈ సినిమా నుంచి తప్పించేశారు. దీనికి తోడు రష్మిక, శ్రీలీల లాంటి క్రేజీ హీరోయిన్లు ఫుల్ స్వింగ్లో ఉండడంతో పూజ హెగ్డే కు ఇక్కడ ఆఫర్లు తగ్గుతున్నాయి.

క్రమక్రమంగా టాలీవుడ్ నుంచి పూజా హెగ్డే ఫేడ్ అవుట్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు మహేష్ బాబుతో పాటు అటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాల్లోను ముందుగా పూజను హీరోయిన్గా అనుకున్నారు. కారణాలు ఏమైనా పూజను తప్పించేసి ఆ ప్లేస్లో శ్రీలీలను తీసుకుంటున్నారు. శ్రీలీల దెబ్బతో పూజ టాలీవుడ్లో విలవిలాడుతోంది. అసలు ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేని పరిస్థితి.

వరుసగా క్రేజీ అవకాశాలు శ్రీలీల‌, రష్మిక తన్నుకు పోతూ ఉండడంతో పూజా హెగ్డే కూడా త్రివిక్రం దగ్గర బోరు మంటున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తనకు అత్యంత ఇష్టమైన పూజా హెగ్డేను త్రివిక్రమ్ వదలలేని పరిస్థితి. అందుకే ఆమెకు ఎట్టకేలకు తానే ఒక ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం తాను మహేష్ బాబుతో తెర‌కెక్కిస్తున్న గుంటూరు కారం సినిమా తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుంది.

హారిక హాసిని క్రియేషన్స్ – గీతా సంస్థలు కలిసి ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంగీత దర్శకుడు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకోవాలని త్రివిక్రమ్ బలంగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా పూజను మొత్తానికి గురూజీ బాగానే ఆదుకుంటున్నట్టు ఉండడంతో ఇండస్ట్రీలో గుసగుసలు అయితే మామూలుగా లేవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news