టాలీవుడ్ లో ప్రతిసారి పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నప్పుడు థియేటర్ల కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలో రిలీజ్ అయినప్పుడు థియేటర్ల కోసం ఎంత పెద్ద యుద్ధాలు ? జరిగాయో చివరకు ఎలా సర్దుబాట్లు జరిగాయో చూసాం. విచిత్రం ఏంటంటే వినాయక చవితికి టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదు. వినాయక చవితిని క్యాష్ చేసుకోవడంలో టాలీవుడ్ జనాలు చేతులెత్తేశారు.
అయితే దసరాకు ఏకంగా నాలుగు సినిమాలు బరిలో ఉన్నాయి. బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఒకేసారి వస్తున్నాయి. కోలీవుడ్ హీరో విజయ్ లియో సినిమా కూడా అప్పుడే ఉంది. బాలీవుడ్ భారీ సినిమా గణపతి కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలలో నైజం పంపిణీ విషయానికి వస్తే భగవంత్ కేసరి – లియో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు ఆసియన్ సునీల్ పంపిణీ చేస్తున్నారు. దీంతో మళ్లీ థియేటర్ల కోసం పెద్ద యుద్ధాలు జరిగేలా ఉన్నాయి. ఈ ఇద్దరు టాప్ డిస్ట్రిబ్యూటర్లే కావడం విశేషం.
వీరిలో ఎవరు వెనక్కు వెళ్లేలా లేదు. టైగర్ నాగేశ్వరరావు సినిమాను కాస్త వాయిదా వేయాలని దిల్ రాజు క్యాంపు నుంచి ఒత్తులు వెళుతున్నాయంటున్నారు. అయితే అందుకు టైగర్ నాగేశ్వరరావు నిర్మాత అభిషేక్ అగర్వాల్ అసలు ఒప్పుకోవటం లేద.ట కావాలంటే మీరే ఒక సినిమాను వాయిదా వేసుకోవాలని చెబుతున్న పరిస్థితి. దీంతో ఇప్పుడు బాలయ్య, రవితేజ సినిమాల కోసం నైజాంలో మళ్లీ థియేటర్ల గొడవలు తప్పేలా లేవు.
సంక్రాంతికి కూడా అదే పరిస్థితి ఉంది మహేష్ బాబు గుంటూరు కారం సినిమా దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. రాజు సొంత సినిమా ఫ్యామిలీ స్టార్ కూడా సంక్రాంతికి ఉంది. అందుకే తేజ సజ్జా హనుమాన్ – రవితేజ ఈగిల్ సినిమాలను వెనక్కు వెళ్లమంటున్నారు. అవి దిల్ రాజు పంపిణీ సినిమాలు కాదు.. అయితే వాళ్లు కూడా కచ్చితంగా మేము సంక్రాంతికి వస్తాం అంటున్నారు. ఏది ఏమైనా ఇటు దసరాకు అటు సంక్రాంతికి మళ్లీ థియేటర్ల గోల తప్పేలా లేదు.